మంచు మనోజ్ రెజీనా జంటగా బేబి త్రిష సమర్పణలో సురక్ష్ ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి.బ్యానర్ పై దశరథ్ దర్శకత్వంలో శివకుమార్ మల్కాపురం నిర్మిస్తున్న చిత్రం 'శౌర్య'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మర్చి 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా..
మంచు మనోజ్ మాట్లాడుతూ.. ''ఇదొక లవ్ థ్రిల్లర్ సినిమా. కమర్షియల్ ఫార్మాట్ లో ఉండే స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ. నిజ జీవితంలో లో శౌర్య అనే పాత్ర ఉంటే అది దశరథ్ గారిలానే ఉంటుంది. సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు. సినిమాకు కులానికి ముడి పెట్టవద్దు'' అని చెప్పారు.
దర్శకుడు దశరథ్ మాట్లాడుతూ.. ''ఇదొక కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. అందరి సపోర్ట్ తో మార్చి 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని అన్నారు.
నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. ''మోహన్ బాబుగారు సినిమా చూసి మనోజ్ కొత్తగా చేశాడని, బ్యానర్ విలువను పెంచే చిత్రమవుతుందని మెచ్చుకున్నారు. 900 పైగా మార్చి 4న థియేటర్స్ లో సినిమాను విడుదల చేస్తున్నాం. మంచి టీం కుదిరింది. ఇలాంటి టీంతో మళ్ళీ సినిమాలు చేయాలనిపిస్తుంది'' అని అన్నారు.
రెజీనా మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో నేత్ర అనే పాత్రలో నటించాను. నాకు ఈ అవకాసం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. మనోజ్ మంచి కోస్టార్. సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను'' అని అన్నారు.
వేదా.కె మాట్లాడుతూ.. ''ఆడియోను హిట్ చేసిన విధంగానే సినిమాను కూడా పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నాను'' అని అన్నారు.
ఈ చిత్రానికి స్టంట్స్: వెంకట్, కొరియోగ్రఫీ: భాను, ఆర్ట్: హరిబాబు, రచనా సహకారం: హరికృష్ణ, సాయికృష్ణ, స్క్రీన్ ప్లే: గోపు కిషోర్, రచన: గోపి మోహన్;, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: వేదా.కె, సినిమాటోగ్రఫీ: మల్హర్ భట్ జోషి, నిర్మాత: శివకుమార్ మల్కాపురం, దర్శకత్వం: దశరథ్.