నాగార్జున, కార్తి, తమన్నా ప్రధాన పాత్రల్లో పెరల్ వి.పొట్లూరి సమర్పణలో పివిపి సినిమాస్ బ్యానర్ పై దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నే నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం 'ఊపిరి'. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ లోని జరిగింది. అమల అక్కినేని బిగ్ సీడీను విడుదల చేశారు. నాగార్జున ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి కాపీను అమలకు అందించారు. ఈ సందర్భంగా..
నాగార్జున మాట్లాడుతూ.. ''మనం, మీలో ఎవరు కోటీశ్వరుడు, సోగ్గాడే చిన్ని నాయన చిత్రాలతో నాపై ప్రేమ చూపించిన ప్రేక్షకులే నా ఊపిరి. నా పెద్ద కొడుకు నాగ చైతన్య 'సాహసం శ్వాసగా సాగిపో' అనే సినిమాలో నటించాడు. నాకు ఆ టైటిల్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడే కాదు ఇండస్ట్రీకు వచ్చిన దగ్గర నుండి నాకు ఆ పదం మీద ఇష్టం ఉండేది. అందుకే 'గీతాంజలి' సినిమా చేశాను. అదే సాహసంతో 'నిన్నే పెళ్ళాడత','అన్నమయ్య' సినిమాల్లో నటించాను. అన్నమయ్యలో నటించేప్పుడు చాలా మంది అవసరమా..? నటించడం అనడిగారు. కాని సినిమా పెద్ద హిట్ అయింది. అలానే సాహసం శ్వాసగా సాగిపోవాలని ఈ సినిమాలో నటించాను. ఊపిరి సినిమా ఒక పెద్ద జర్నీ. అమల, నేను కూర్చొని ఫ్రెంచ్ ఫిలిం 'ఇన్ టచబుల్స్' చూసినప్పుడు తెలుగులో ఈ సినిమా చేస్తే బావుంటుందని, నేను నటించాలని అనుకున్నాను. మూడు సంవత్సరాల తరువాత వంశీ గారు అదే సినిమా స్టొరీ నాకు చెప్పారు. వెంటనే సినిమాలో నటించడానికి ఓకే చెప్పాను. ఈ సినిమాలో కాళ్ళు, చేతులు పడిపోయిన పాత్రలో నటించినా.. మనసు మాత్రం పరిగెడుతూనే ఉంటుంది. స్నేహం, ప్రేమ, ఎంటర్టైన్మెంట్ ఇలా అన్ని అంశాలు కలగలిపిన చిత్రం. ప్రపంచమేంటో ఈ సినిమాలో చూపించాం. వంశీ చాలా బాగా డైరెక్ట్ చేశాడు. మనిషికి కావాల్సింది ఒక తోడు. ఆ తోడు ఎంత అవసరమో.. అనేదే ఈ సినిమా సారాంశం. ఈ సినిమాతో నాకు కార్తి లాంటి ఫ్రెండ్, తమ్ముడు దొరికాడు. ఈ సినిమాకు ఇంకో ఊపిరి పివిపి గారు. గోపి సుందర్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. అన్నమయ్య, శివ, గీతాంజలి సినిమాలు నాకు ఎంత పెద్ద పేరును తీసుకోచ్చాయో.. అలానే ఈ సినిమా కూడా పెద్ద పేరు తీసుకొస్తుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.
వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. ''ఇదొక ఎమోషనల్ మూమెంట్ నాకు. రెండు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం ట్రావెల్ అవుతున్నాను. ఈ ట్రావెల్ చేసే సమయంలోనే నేనేంటో నాకు తెలిసింది. ఈ సినిమాకు నాగార్జున, కార్తి, పివిపి గారే ఊపిరి. కథ చెప్పిన వెంటనే పివిపి గారు సినిమా చేయడానికి ఓకే చెప్పారు. ఆ నిమిషం ఎప్పటికి మర్చిపోలేను. ఎంతగానో సపోర్ట్ చేశారు. ఎంతోమంది కార్తిని తెలుగులో లాంచ్ చేయాలనుకున్నారు. ఆ అవకాసం నాకు దక్కింది. అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన తనకు దర్శకుల బాధ్యత, కష్టాలు ఏంటో బాగా తెలుసు. నాగార్జున, కార్తిలు లేకపోతే ఊపిరి సాధ్యమయ్యేది కాదు. పివిపి గారు నన్నొక తమ్ముడిలా చూసుకున్నారు. గోపి సుందర్ మలయాళంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాకు మంచి మ్యూజిక్ అందించారు. నా వెనుక ఎందరో కష్టపడితే నాకు డైరెక్టర్ గా మంచి క్రెడిట్ వస్తుంది. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్'' అని చెప్పారు.
కార్తి మాట్లాడుతూ.. ''తెలుగులో సినిమా ఎప్పుడు చేస్తావని చాలా మంది అడిగారు. కాని నాకు కథలు నచ్చకపోవడం వలన చేయలేదు. వంశీ గారు చెప్పిన కథకు నో చెప్పే అవకాసం దొరకలేదు. స్క్రిప్ట్ బాగా నచ్చింది. నాగ్ సర్ సినిమాలో నటిస్తున్నారని తెలియగానే నేను కూడా చేయాలని డిసైడ్ అయ్యాను. మా అమ్మ నాగ్ సర్ కు పెద్ద ఫ్యాన్. ఈ సినిమాలో మా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిచాం. అందరు ఎఫర్ట్స్ పెట్టి చేసిన సినిమా. పివిపి గారు లేకపోతే ఈ సినిమా లేదు. ప్రతీ సీన్ లో పెర్ఫార్మన్స్ ఉంటుంది. గోపి సుందర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమా సెకండ్ హాఫ్ లో నాగ్ సర్ పెర్ఫార్మన్స్ చూసి అందరం ఏడ్చేశాం. ఆడియన్స్ ను కూడా ఈ సినిమా ఆకట్టుకుంటుంది'' అని చెప్పారు.
పివిపి మాట్లాడుతూ.. ''ఈ సినిమా చేయడానికి రెండు సంవత్సరాల సమయం పట్టింది. నాగార్జున, కార్తిలే ఈ సినిమా ఊపిరి. సినిమా మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.
గోపిసుందర్ మాట్లాడుతూ.. ''మలయాళంలో నేను అనుకున్న చాలా సినిమాలు హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుందని నేను భావిస్తున్నాను'' అని చెప్పారు.
రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ''సినిమాలకు భాష అవసరం లేదని పివిపి గారు నిరూపించారు. తమిళ, తెలుగు బాషలలో ఈ చిత్రాన్ని రూపొందించారు. గోపి సుందర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ప్రతి పాట చాలా బావుంది. ముఖ్యంగా 'ఎందరో మహానుభావులు అందరికి వందనాలు' అనే థీమ్ సాంగ్ చాలా బావుంది. వంశీ లైన్ చెప్పగానే చాలా నచ్చింది. నాగార్జునలానే కార్తి కూడా కొత్త కథలను ఎంచుకొని సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ''నాగ్ నాకు మంచి ఫ్రెండ్, కొలీగ్. ఇండస్ట్రీలో ఉన్న వారు నాగ్ వ్యక్తిత్వం నుండి చాలా నేర్చుకోవాలి. కొత్త దనాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయాలని తపన పడుతుంటాడు. ఇలాంటి వ్యక్తి ఉండడం వలనే ఊపిరి సినిమా జరిగింది. కార్తీ ప్రతి సినిమాను డిఫరెంట్ గా ఉండేలా చూస్తున్నారు. వంశీతో మూడో సినిమా. తను ఇలాంటి సినిమా చేస్తాడని నమ్మలేదు. కొత్తగా ప్రయత్నించాడు. మనసుతో, అనుభవంతో చూడాల్సిన సినిమా ఇది'' అని చెప్పారు.
అశ్వనీదత్ మాట్లాడుతూ.. ''నా అభిమాన హీరో నాగార్జున ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టబోతున్నాడు. కార్తి మొదటిసారి తెలుగులో స్ట్రెయిట్ ఫిలిం లో నటించాడు. సౌత్ ఇండియాలో సెన్సేషన్ ప్రొడ్యూసర్ పివిపి. ఈ బ్యానర్ పేరు వింటే ఒకప్పటి జగపతి, సురేష్ ప్రొడక్షన్స్ గుర్తొస్తున్నాయి'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో కాజల్, జయసుధ, కళ్యాన్ కృష్ణ, దిల్ రాజు, సుమంత్, సుశాంత్, హరీష్ శంకర్, అబ్బూరి రవి, రామజోగయ్య శాస్త్రి, అడవి శేష్, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.
నాగార్జున, కార్తీ, తమన్నా భాటియా, జయసుధ, ప్రకాష్‌రాజ్, కల్పన, ఆలీ, తనికెళ్ళ భరణిలతోపాటు ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్‌కు సంగీతం: గోపీసుందర్, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: పి.ఎస్.వినోద్, ఎడిటింగ్: మధు, ఫైట్స్: కలోయిన్ ఒదెనిచరోవ్, కె.రవివర్మ, సిల్వ, డాన్స్: రాజు సుందరం, బృంద, స్టోరీ అడాప్షన్: వంశీ పైడిపల్లి, సాల్మన్, హరి, మాటలు: అబ్బూరి రవి, ప్రొడక్షన్ డిజైనర్: సునీల్‌బాబు, సమర్పణ: పెరల్ వి.పొట్లూరి, నిర్మాతలు: పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నే, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.