Advertisementt

శ్రీకాంత్ తో మరో సినిమా చేస్తా:షేక్ మస్తాన్

Mon 29th Feb 2016 05:57 PM
shek masthan,terror movie,srikanth,satheesh kasetty  శ్రీకాంత్ తో మరో సినిమా చేస్తా:షేక్ మస్తాన్
శ్రీకాంత్ తో మరో సినిమా చేస్తా:షేక్ మస్తాన్
Advertisement
Ads by CJ

శ్రీకాంత్, నికితా జంటగా అఖండ భారత క్రియేషన్స్ పతాకంపై షేక్ కరీమ్ సమర్పణలో సతీష్ కాసెట్టి దర్శకత్వంలో షేక్ మస్తాన్ నిర్మించిన సినిమా 'టెర్రర్'. ఇటీవల విడుదలయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత షేక్ మస్తాన్ విలేకర్లతో ముచ్చటించారు.

''సినిమాల్లోని రాకముందు ఆరా అనే ఏజెన్సీను స్థాపించాను. అదొక పోల్ మ్యానేజ్మెంట్ ఏజెన్సీ ఇప్పటికి అది సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. రాజకీయాల్లో పని చేస్తుండడం వలన నేను నరేంద్ర మోడీ టీంతో కొంతకాలం ట్రావెల్ అయ్యే అవకాసం లభించింది. దాంతో ఆయన గురించి ప్రజలకు తెలియని కొన్ని విషయాలను తెలియబరచాలనే ఉద్దేశ్యంతో సినిమా చేయాలనుకున్నాను. సతీష్ కాసెట్టి గారిని కలిసి ఈ విషయం గురించి మాట్లాడాను. ఆయన 35 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ఆ సమయంలో అంత ఖర్చు పెట్టే స్తోమత నాకు లేకపోవడం వలన ఆ నిర్ణయాన్ని విరమించుకున్నాను. ఆ తరువాత సతీష్ గారు 'టెర్రర్' సినిమా చేద్దామని కథ పట్టుకొని నన్ను కలిశారు. స్టోరీ నచ్చడంతో సినిమా నిర్మించడానికి ఓకే చెప్పాను. అప్పటివరకు నాకు సినిమా ఇండస్ట్రీ గురించి అందరు తప్పుగా చెప్పేవారు. కాని శ్రీకాంత్ గారిని కలిసిన తరువాత నా ఒపినియన్ మొత్తం మారిపోయింది. అంత మంచి మనిషిని నేను ఎక్కడ చూడలేదు. తనపై బరోస పెట్టినందుకు బాధ్యతగా ఈ సినిమాకు పని చేశారు. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. థియేటర్ల సంఖ్య కూడా పెరిగింది. నేను చేయబోయే తదుపరి సినిమాలు కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాను. మా బ్యానర్ లో ఏడాదికి ఒక సినిమా చొప్పున నిర్మించాలనుకుంటున్నాను.  కిరణ్ అనే కొత్త దర్శకుడు స్టోరీ ఒకటి చెప్పారు. త్వరలోనే సినిమాను మొదలు పెట్టనున్నాను. అది కూడా సందేశాత్మక చిత్రమే. ఇక 2018 లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ఆధారంగా శ్రీకాంత్ హీరోగా సినిమా చేయాలనుకుంటున్నాను'' అని తెలియజేశారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ