Advertisementt

'పడేసావే' ప్లాటినం డిస్క్ ఫంక్షన్!

Thu 25th Feb 2016 02:16 PM
padesave movie platinum disc function,nagarjuna,chunia  'పడేసావే' ప్లాటినం డిస్క్ ఫంక్షన్!
'పడేసావే' ప్లాటినం డిస్క్ ఫంక్షన్!
Advertisement
Ads by CJ

కార్తిక్ రాజు, నిత్య శెట్టి, సామ్ ప్రధాన పాత్రల్లో అయాన్ క్రియేషన్స్ బ్యానర్ పై చునియా దర్శకత్వం వహిస్తూ.. నిర్మిస్తోన్న చిత్రం 'పడేసావే'. ఈ సినిమా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ బుధవారం హైదరాబాద్ లో జరిగింది. యూనిట్ సభ్యులకు నాగార్జున ప్లాటినం డిస్క్ లను అందజేశారు. ఈ సందర్భంగా..

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. ''సినిమా మ్యూజిక్ పెద్ద హిట్ అయింది. రేడియోలో ఈ సినిమా పాటలు బాగా వినపడుతున్నాయి. చునియా నాకు బాగా తెలుసని ఈ సినిమాను ప్రమోట్ చేయట్లేదు. జెన్యూన్ గా సినిమా నచ్చి ప్రమోట్ చేయాలనుకున్నాను. ఏడెనిమిది నెలల క్రితం చునియా ఈ సినిమా కథ చెప్పి మా వెనుకే ఉండి సపోర్ట్ చేస్తారా.. అని అడిగింది. సినిమా చేసి నాకు చూపించు.. నచ్చితే ఖచ్చితంగా ప్రమోట్ చేస్తానని చెప్పాను. సినిమా చూసిన తరువాత నేనే ప్రమోట్ చేయాలనుకున్నాను. అందరూ ఇన్వాల్వ్ అయ్యి నటించారు. రిలీజ్ అయిన తరువాత ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. ఈ సినిమా హిట్ అయితే కొత్త టాలెంట్ ను ప్రోత్సహించినట్లు ఉంటుంది. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.

చునియా మాట్లాడుతూ.. ''ఇండస్ట్రీకు వచ్చి 16 సంవత్సరాలయ్యింది. నా కల నెరవేర్చుకోవడానికి వచ్చాను. సినిమాను డైరెక్ట్ చేయాలనేదే నా కల. ఆ విషయంలో నాగ్ సర్ నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు. కొత్త వాళ్లకు ఎప్పుడూ.. నాగ్ సర్ ప్రోత్సాహం ఉంటుంది. ఫిబ్రవరి 26 న సినిమా రిలీజ్ అవుతుంది. అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. ''చునియా గారితో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. నాగార్జున గారు కొత్త వాళ్ళను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. ఈ సినిమాకు కూడా ఆయన మంచి సపోర్ట్ ఇచ్చారు. ఫిబ్రవరి 26 న సినిమా రిలీజ్ అవుతోంది. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో నిత్య, కార్తిక్, సీనియర్ నరేష్, విశ్వ, కృష్ణుడు, కిరణ్, అనితాచౌదరి, అనంత్ శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి మ్యూజిక్: అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ: కన్నా కునపరెడ్డి, ఎడిటింగ్: ధర్మేంద్ర.కె, డైలాగ్స్: కిరణ్ కుమార్, లిరిక్స్: అనంత్ శ్రీరాం, స్టంట్స్: వెంకట్, కోరియోగ్రఫీ: రాజు సుందరం, విజయ్, చంద్రకిరణ్, డైరెక్టర్: చునియా.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ