Advertisementt

సెల్ఫీ ఫోటో ఫేమస్ అయింది:దామోదర్ ప్రసాద్

Tue 23rd Feb 2016 04:28 PM
damodar prasad,kalyana vaibhogame,march 4th release,nandini reddy  సెల్ఫీ ఫోటో ఫేమస్ అయింది:దామోదర్ ప్రసాద్
సెల్ఫీ ఫోటో ఫేమస్ అయింది:దామోదర్ ప్రసాద్
Advertisement
Ads by CJ

శ్రీ రంజిత్ మూవీస్ పతాకం పై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ 'అలా మొదలైంది', 'అంతకు ముందు ఆ తరువాత' లాంటి కుటుంబ కధా చిత్రాల తరువాత బి.వి నందిని రెడ్డి దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం 'కళ్యాణ వైభోగమే'. నాగ శౌర్య, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత దామోదర్ ప్రసాద్ విలేకర్లతో ముచ్చటించారు. 

''ఈ సినిమాను మార్చి 4న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. మా బ్యానర్ లో నేను సినిమా కథను ఓకే చేసి కాపీ రెడీ అయిన తరువాతే ఆ సినిమా గురించి మాట్లాడతాను. ఈ సినిమా కోసం 14 నెలలుగా వర్క్ చేశాం. ఇటీవలే సినిమా ఆడియో విడుదలయ్యింది. పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. లక్ష్మీ భూపాల్ సింగిల్ కార్డులో పాటలన్నీ రాశాడు. నందిని రెడ్డి, నా కాంబినేషన్ మ్యాజికల్ గా ఉంటుంది. కంటెంట్, కథ విషయంలో మా వేవ్ లెంగ్థ్స్ ఒకేలా ఉంటాయి. కళ్యాన్ మాలిక్ నాలుగైదు సినిమాలకు మాతోపాటే ట్రావెల్ చేస్తున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే ఆయన మా ఆస్థాన విధ్వాంసుడు. ఇంతకముందు కంటే ఆయన అందించిన ఈ ఆల్బం ఇంకా బెటర్ గా ఉంటుంది. ప్రతి సినిమాకు మేము కొత్త టెక్నీషియన్స్ పరిచయం చేస్తుంటాం. ఈ సినిమా ద్వారా రాజు అనే సినిమాటోగ్రాఫర్ ను పరిచయం చేస్తున్నాం. సెన్సార్ పూర్తయిన తరువాత ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ వస్తోంది. ముఖ్యంగా పెళ్లి పీటల మీద తీసుకునే సెల్ఫీ ఫోటో బాగా ఫేమస్ అయింది. ఇదొక లవ్ స్టొరీ కాని రెగ్యులర్ సినిమాల ఉండదు. ప్రస్తుతం ఉన్న యువతకు ప్రేమ, పెళ్లి, విడాకులు అంటే సరైన నిర్వచనం తెలియట్లేదు. ఆ విషయాలను డిస్కస్ చేస్తూ... ఎంటర్టైనింగ్ వే లో ఈ సినిమాను తీశాం. అభిషేక్ పిక్చర్స్ వారు ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. సినిమాను తీయడం ఒక ఎత్తయితే దాన్ని రిలీజ్ చేయడం మరో ఎత్తు. ఇన్ని థియేటర్లలో నా సినిమా రిలీజ్ చేయాలని నేనెప్పుడు అనుకోను. సినిమా బావుంటే స్క్రీన్స్ నెంబర్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది'' అని తెలియజేశారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ