Advertisement

'దండకారణ్యం' పాటలు విడుదల!

Tue 23rd Feb 2016 02:00 PM
dandakaranyam audio launch,narayanamurthy,gaddhar  'దండకారణ్యం' పాటలు విడుదల!
'దండకారణ్యం' పాటలు విడుదల!
Advertisement

స్నేహా చిత్ర పిక్చర్స్ బ్యానర్ పై ఆర్.నారాయణమూర్తి, విక్రమ్, ప్రసాద్ రెడ్డి, త్రినాద్ ప్రధాన పాత్రల్లో నారాయణమూర్తి దర్శకత్వం వహిస్తూ.. నిర్మిస్తున్న చిత్రం 'దండకారణ్యం'. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. గద్ధర్ ఆడియో సీడీలను ఆవిష్కరింఛి తొలి సీడీని అల్లం నారాయణకు అందించారు. ఈ సందర్భంగా..

ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. ''నా బ్యానర్ లో వస్తున్న 28వ చిత్రమిది. మూల వనరులు మూలవాసీయులకే చెందాలి. విదేశీపాలు కాకూడదని ఆదివాసీయుల హక్కుల కోసం చర్చించే చిత్రమే ఈ దండకారణ్యం'' అని చెప్పారు.

అల్లం నారాయణ మాట్లాడుతూ.. ''చాలారోజుల తర్వాత ఈ సినిమాలో గద్ధర్ అన్న పాటలు రాయడమే కాదు, ఒక పాటలో నటించారు. మన విలువలను కాపాడుకోవాలని తెలియజేసే చిత్రమిది. ఇందులో కిషన్ జీ క్యారెక్టర్ ను నారాయణమూర్తి చేయడం అభినందనీయం'' అని చెప్పారు.

గద్ధర్ మాట్లాడుతూ.. ''ఈ దేశంలోని సంపదను కాపాడుకునే బాధ్యత అందరిపైనా ఉంటుంది. మన వనరుల్ని మనమే రక్షించుకోవాలని, మన బాధ్యతను తెలియజేసే సినిమా ఇది. నారాయణమూర్తి అడగటంతో చాలా రోజుల తర్వాత పాటలు పాడడంతో పాటు నటించాను కూడా. నారాయణమూర్తి సినిమా రంగానికి చెందిన మిత్రుడే కాదు. ఉద్యమాన్ని గుండెలకు హత్తుకున్న వ్యక్తి. తన తీసే సినిమాల్లో చాలా కమిట్ మెంట్ తో ఉంటాడు. ఈ సినిమాను సక్సెస్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది'' అని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో నారదాస్ లక్ష్మణ్ దాస్, గోరేటి వెంకన్న, ములుగు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి కెమెరా: శివకుమార్, ఆపరేటివ్ కెమెరామెన్: నాగేష్ బాబు, కథ,చిత్రానువాదం, మాటలు, ఎడిటింగ్, కోరియోగ్రఫీ, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, సంగీతం, నిర్మాత, దర్శకత్వం: ఆర్.నారాయణమూర్తి.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement