వికాష్, కళ్యాణి జంటగా దుర్గాదేవి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై ఎన్.డి.ఉదయ్ కుమార్ దర్శకత్వంలో నాగేశ్వరావు నిర్మిస్తోన్న చిత్రం 'తుహిరే మేరీ జాన్'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో..
దర్శకుడు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. ''ఇదొక ఫుల్ లెంగ్థ్ ఎంటర్టైనింగ్ మూవీ. చిన్న సినిమా అయినా అందరూ ఇష్టపడి చేసిన సినిమా. ఇప్పటికే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. ఈ నెలలోనే ఆడియో విడుదల చేసి మార్చి నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు.
హీరో వికాష్ మాట్లాడుతూ.. ''తెలుగులో ఇది నా మొదటి సినిమా. అందరూ కొత్తవాళ్ళతో కలిసి చేశాం. మంచి పాటలు కుదిరాయి. సినిమాను కొత్తగా తీయడానికి ప్రయత్నించాం. ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం'' అని చెప్పారు.
కళ్యాణి మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో స్నేహం, ప్రేమ, కుటుంబ విలువలు అన్ని కలగలిపి ఉంటాయి. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించాను. నాకు ఈ అవకాసం ఇచ్చిన డైరెక్టర్ గారికి థాంక్స్'' అని చెప్పారు.
చాణక్య మాట్లాడుతూ.. ''ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధంగా సినిమాను తీర్చిదిద్దాం. సినిమాలో ఆరు పాటలు రాశాను. జోడా శాండీ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు'' అని చెప్పారు.
ఈ చిత్రానికి సంగీతం: జోడా శాండీ, కోరియోగ్రఫీ: కెవిన్, బాబి ఏంటోనీ, ఎడిటింగ్: రాజు లీల, పాటలు: చాణక్య, నిర్మాత: నాగేశ్వరావు, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎన్.డి.ఉదయ్ కుమార్.