Advertisementt

'అప్పుడలా ఇప్పుడిలా' రిలీజ్ డేట్ ఫిక్స్!

Tue 23rd Feb 2016 12:59 AM
appudala ippudila movie,vishnu,pradeep kumar,surya tej  'అప్పుడలా ఇప్పుడిలా' రిలీజ్ డేట్ ఫిక్స్!
'అప్పుడలా ఇప్పుడిలా' రిలీజ్ డేట్ ఫిక్స్!
Advertisement
Ads by CJ

సూర్యతేజ, హర్షికా పునాచా హీరో హీరోయిన్లుగా దుహ్రా మూవీస్ సమర్పణలో, జంపా క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం 'అప్పుడలా ఇప్పుడిలా'. కె.ఆర్.విష్ణు దర్శకుడు. ప్రదీప్ కుమార్ జంపా నిర్మాత. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ చిత్ర పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో చిత్రబృందం సోమవారం హైదరాబాద్ లోని  ఆడియో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..

నిర్మాత ప్రదీప్ కుమార్ జంపా మాట్లాడుతూ.. ''సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సునీల్ కశ్యప్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి. కుటుంబ విలువలతో కూడిన సినిమా. సెన్సార్ నుండి క్లీన్ యు సర్టిఫికేట్ లభించింది. సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఫిబ్రవరి 26న సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు.

కె.ఆర్.విష్ణు మాట్లాడుతూ... ''ఈ సినిమాతో దర్శకుడిగా అవకాశం ఇచ్చిన ప్రదీప్ గారికి చాలా థాంక్స్. మంచి ప్రేమ కథను ఎంటర్ టైనింగ్ గా చెప్పాం. కుటుంబంతో సహా అందరూ చూడదగ్గ సినిమా. మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 26న సినిమా రిలీజ్ చేస్తున్నాం'' అని చెప్పారు.

సునీల్ కశ్యప్ మాట్లాడుతూ.. ''సినిమా పాటలను అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. రేడియో స్టేషన్స్ లో ఈ సినిమా పాటలు బాగా వినపడుతున్నాయి. ఈ సినిమాతో అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో సుర్యతేజ్, హర్షిక, రామచంద్రారెడ్డి, సత్యదేవ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ - భిక్షపతి తుమ్మల, కథ: బ్రహ్మారెడ్డి కమతం, సంగీతం: సునీల్ కశ్యఫ్, ఎడిటర్: ఎస్.బి.ఉద్ధవ్, ఫైట్స్ - రామ్ సుంకర, సినిమాటోగ్రఫీ: పి.సి.ఖన్నా, డ్యాన్స్: రాకేష్, శేఖర్, భాను, పాటలు - చైతన్య వర్మ, పి ఆర్ ఓ - తేజస్వి సజ్జ, నిర్మాత: ప్రదీప్ కుమార్ జంపా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.ఆర్.విష్ణు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ