Advertisementt

'గుంటూర్ టాకీస్' ఆడియో లాంచ్!

Sun 21st Feb 2016 04:56 PM
guntur talkies movie audio launch,praveen sattharu,reshmi,siddhu  'గుంటూర్ టాకీస్' ఆడియో లాంచ్!
'గుంటూర్ టాకీస్' ఆడియో లాంచ్!
Advertisement
Ads by CJ

సిద్ధు జొన్నలగడ్డ, రష్మి గౌతమ్, శ్రద్దా దాస్ ప్రధాన పాత్రల్లో ఆర్.కె.స్టూడియోస్ బ్యానర్ పై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఎమ్.రాజ్ కుమార్ నిర్మిస్తున్న సినిమా 'గుంటూర్ టాకీస్'. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరిగింది. లహరి మ్యూజిక్ ద్వారా మధురా శ్రీధర్ రెడ్డి ఆడియోను విడుదల చేశారు.

నరేష్ మాట్లాడుతూ.. ''ప్రవీణ్ సత్తారు మూడవ సినిమా ఇది. నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న డైరెక్టర్. సినిమా సినిమాకు పొంతన లేకుండా డిఫరెంట్ కాన్సెప్ట్స్ సెలెక్ట్ చేసుకొని చేస్తున్నారు.  సంవత్సరంన్నర నుండి ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. నిర్మాతలకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

లక్ష్మీ మంచు మాట్లాడుతూ.. ''చందమామ కథలు టీం అందరు కలిసి చేస్తున్నారు. 'చందమామ కథలు' సినిమా నాకు చాలా నేర్పింది. మరోసారి ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. సిద్ధు టాలెంట్ ఉన్న నటుడు. ఇన్వాల్వ్ అయ్యి నటిస్తాడు. గుంటూరు టాకీస్ టీం కు నా ఆల్ ది బెస్ట్. మార్చి 4న సినిమా రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ.. ''ఈ చిత్రం తెలుగు ఇండస్ట్రీలో మార్పు తీసుకొస్తుంది. విభిన్నంగా ఉండే చిత్రం. అందరూ హార్డ్ వర్క్ చేసి తీశాం. మార్చి 4న సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకల మాట్లాడుతూ.. ''స్టొరీ చెప్పినప్పుడు బాగా ఎగ్జైట్ అయ్యాను. చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఒక డెమో ఇవ్వమని అడిగారు. రాక్ బ్యాండ్ వాయిస్తుంటాను. ఈ సినిమాకు నా స్టైల్ ఆఫ్ మ్యూజిక్ లో చేసే అవకాసం వచ్చింది. డెమో ఇచ్చిన తరువాత నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చి వర్క్ చేయించుకున్నారు. కథను కొత్తగా ప్రెజంట్ చేశారు'' అని చెప్పారు.

రేష్మి మాట్లాడుతూ.. ''నాకు ఈ సినిమాలో నటించే అవకాసం ఇచ్చిన దర్శకుడు ప్రవీణ్ కు థాంక్స్. మార్చి 4న సినిమా విడుదలవుతుంది. శ్రీ చరణ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు'' అని చెప్పారు.

సిద్ధు మాట్లాడుతూ.. ''నాకు ఈ సినిమా టీం ఎప్పటికి గుర్తుండిపోతుంది. అందరం కష్టపడి సినిమా చేశాం. శ్రీ చరణ్ కు ఈ సినిమాతో మంచి పేరొస్తుంది. 'చందమామ కథలు' సినిమాతో నేషనల్ అవార్డు సంపాదించుకున్న దర్శకునితో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. సెన్సిబుల్, ఇంటెలిజెంట్ ఫిలిం మేకర్.'' అని చెప్పారు. 

రవికాంత్ పేరేపు మాట్లాడుతూ.. ''ఇంటెలిజెంట్ ఫిలిం మేకర్ ప్రవీణ్ సత్తారు.శ్రీ చరణ్ మంచి ఆల్బం ఇచ్చాడు. సాంగ్స్ అన్నీ చాలా బావున్నాయి. సిద్ధూ టెరిఫిక్ పెర్ఫార్మార్. దర్శకుల నటుడు తను. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో మధుషాలిని, సముద్ర, బెక్కం వేణుగోపాల్, సీనియర్ నరేష్, అనసూయ, సుదీర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: రామిరెడ్డి, మ్యూజిక్: శ్రీచరణ్ పాకల, ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల, కొరియోగ్రాఫర్: గణేష్ మాస్టర్, ప్రొడ్యూసర్: రాజ్ కుమార్, కథ-దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ