Advertisementt

కొత్త పోరి లోలోప‌లే ఒప్పేసుకుందే!

Sun 21st Feb 2016 04:55 PM
mehareen,actress mehareen,krishna gaadiveera premagatha,puri jaganath,   కొత్త పోరి లోలోప‌లే ఒప్పేసుకుందే!
కొత్త పోరి లోలోప‌లే ఒప్పేసుకుందే!
Advertisement
Ads by CJ

 

సినిమా రిలీజ్‌కి ముందు మెహ‌రీన్‌కి ఆల్ ది బెస్ట్ చెబుతూ పూరి జ‌గ‌న్నాథ్  ట్వీట్ చేసిన‌ప్పుడే ఎక్క‌డో కొట్టింది. అస‌లు తెలుగు ఇండ‌స్ట్రీలో పెద్ద‌గా ప‌రిచ‌యం లేని...  ఇంకా ఒక సినిమా కూడా చేయ‌ని  కొత్త పోరికి స్టార్ డైరెక్ట‌ర్ అయిన పూరి జ‌గ‌న్నాథ్ విషెస్ చెప్ప‌డ‌మేంటి అని. ఆ ట్వీట్‌నిబ‌ట్టి వాళ్లిద్ద‌రికీ పాత ప‌రిచ‌యం ఏదో ఉంద‌న్న విష‌యం మాత్రం స్ప‌ష్టంగా అర్థ‌మైంది. అది నిజం అని ఇప్పుడు తెలుస్తోంది. `కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌`లో న‌టిస్తున్న‌ప్పుడే పూరి త‌న కొత్త చిత్రం కోసం మెహ‌రీన్‌ని ఎంపిక చేసేశాడ‌ని స‌మాచారం.  త్వ‌ర‌లోనే మెహ‌రీన్ పూరి కాంపౌండ్‌లోకి అడుగుపెట్ట‌బోతోంద‌న్న‌మాట‌. 
పూరి జ‌గ‌న్నాథ్ మ‌న‌సు ఎప్పుడూ కొత్త పోరీల‌పైనే ఉంటుంది. తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ప్ర‌తీ సినిమాతోనూ కొత్త భామ‌ల్ని ప‌రిచ‌యం చేయాల‌ని చూస్తుంటాడు. అందులో భాగంగా ముంబైకి వెళ్లి అక్క‌డి మోడ‌ల్స్‌ని ఆడిష‌న్స్ చేసొస్తుంటాడు. బాగా న‌చ్చారంటే వెంట‌నే తీసుకొచ్చేస్తాడు. అలా మెహ‌రీన్ కూడా పూరికి చాలా రోజుల కింద‌టే ప‌రిచ‌య‌మైంద‌ట‌. ఎవ్వ‌రికీ తెలియ‌దు కానీ... లోలోప‌లే త‌న కొత్త సినిమాకోసం ఆమెని ఎంపిక చేసేశాడు. త్వ‌ర‌లోనే క‌ళ్యాణ్‌రామ్‌తో పూరి తెర‌కెక్కించనున్న రీమిక్స్‌లో మెహ‌రీన్ న‌టించ‌బోతోంద‌ని స‌మాచారం. దాంతోపాటు మెహ‌రీన్ మ‌రో కొత్త చిత్రానికి ఓకే చెప్పింద‌ని తెలిసింది. ఆ చిత్రంలో సాయిధ‌ర‌మ్ తేజ్‌తో క‌లిసి న‌టించ‌బోతోంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం మెహ‌రీన్ కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా గ‌డుపుతోంది. ఆ క్యాంపెయిన్ నుంచి తిరిగా రాగానే త‌న కొత్త చిత్రాన్ని ప్ర‌క‌టించే అవకాశాలున్నాయి. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ