Advertisementt

'తుంటరి' పాటలు విడుదల!

Sat 20th Feb 2016 02:02 PM
thuntari audio launch,nara rohit,kumar nagendra,ashok  'తుంటరి' పాటలు విడుదల!
'తుంటరి' పాటలు విడుదల!
Advertisement

నారా రోహిత్, లతా హేగ్దే జంటగా శ్రీ కీర్తి ఫిల్మ్స్ బ్యానర్ పై కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో అశోక్, నాగార్జున్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'తుంటరి'. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లో జరిగింది. వి.వి.వినాయక్ బిగ్ సీడీను, ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి కాపీను రేవంత్ రెడ్డి కు అందించారు. రేవంత్ రెడ్డి థియేట్రికల్ ట్రైలర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా..

వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. ''నేను బాలయ్యతో చెన్నకేశవ రెడ్డి చేస్తున్నప్పుడు రోహిత్ ఫాదర్ తో మంచి పరిచయం ఏర్పడింది. తనకు ఇంత అందమైన కొడుకు ఉన్నాడా.. అనుకున్నాను. ట్రైలర్ బావుంది. కామెడీ యాంగల్ లో రోహిత్ ను చూపించారు. అశోక్, కుమార్ నాగేంద్ర, నేను ఒక వూరికి చెందిన వాళ్ళమే. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి నిర్మాతలకు లాభాలు రావాలి. పాటలు చాలా బావున్నాయి. సాయి కార్తిక్ ఆల్బం పెద్ద హిట్ కావాలి'' అని చెప్పారు.

రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ''నారా అంటే క్రమశిక్షణ, నందమూరి అంటే పౌరుషానికి మారు పేరు. అమెరికా సైన్యం ముప్పై లక్షలు.. తెలుగుదేశం సైన్యం అరవై లక్షలు. మన సైన్యం సినిమాను రెండు సార్లు చూస్తే చాలు.. ఇంకెవరు చూడక్కర్లేదు. మన బాణం నారా రోహిత్.. మన ప్రతినిధి నారా రోహిత్, మన తుంటరి నారా రోహిత్. రాజు గారు దిల్ సినిమా చేసి దిల్ రాజు ఎలా అయ్యాడో.. రోహిత్ తుంటరి సినిమా చేస్తూ.. తుంటరి రోహిత్ కావాలి. తనకు ఇది ఎనిమిదవ సినిమా. ఇలానే 100 సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అభిమానుల కోసం సినిమాలు.. ప్రజల కోసం ఆదర్శవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

నారా రోహిత్ మాట్లాడుతూ.. ''తమిళ సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ఇంత మంచి క్యారెక్టర్ లో నటించే అవాకాసం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. సాయి కార్తిక్ తో ఇది నాకు నాల్గవ సినిమా. మంచి మ్యూజిక్ ఇస్తాడు. కామెడీ సినిమా. అందరూ ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను'' అని చెప్పారు.

తారకరత్న మాట్లాడుతూ.. ''మా బావకు కరెక్ట్ ఫిలిం ఇది. తన పంచ్ లు, కామెడీ టైమింగ్ గురించి చెప్పక్కర్లేదు. సొసైటీకు, యూత్ కు కనెక్ట్ అయ్యే సినిమాల్లో నటిస్తుంటాడు. ఈ సినిమాలో అన్ని జోనర్స్ ను టచ్ చేస్తూ.. కొత్త లుక్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

సాయి కార్తిక్ మాట్లాడుతూ.. ''ఇదొక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. అన్ని జోనర్స్ లో ఉండే పక్కా కమర్షియల్ ఫిలిం ఇది. పటాస్ సినిమా నుండి నన్ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ సినిమాను కూడా హిట్ చేయాలని ఆశిస్తున్నాను'' అని చెప్పారు. 

శ్రీవాస్ మాట్లాడుతూ.. ''ఈ సినిమా ఆడియోకు రావడం సంతోషంగా ఉంది. కుమార్ నాగేంద్ర నేను కలిసి కృష్ణవంశీ గారి దగ్గర వర్క్ చేశాను. కుమార్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో 'గుండెల్లో గోదారి','జోరు' చిత్రాలను డైరెక్ట్ చేశాడు. మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొని ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. నారా రోహిత్ పవర్ ఫుల్ హీరో. తనంటే నాకు చాలా ఇష్టం. తనతో సినిమా చేయాలని కూడా అనుకున్నాను. కాని కుదరలేదు. విభిన్న సినిమాలు చేయాలంటే మొదట గుర్తొచ్చేది నారా రోహితే.. సాయి కార్తిక్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి'' అని చెప్పారు.

కాశి విశ్వనాథ్ మాట్లాడుతూ.. ''నారా రోహిత్ విభిన్న చిత్రాలను ఎంపిక చేసుకుంటాడు. మురుగదాస్ అందించిన కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నిర్మాతలు ప్లానింగ్ ప్రకారం సినిమాలు చేస్తున్నారు. కుమార్ నాగేంద్ర కూల్ పెర్సన్. అనుకున్న దానికంటే ముందే సినిమాను పూర్తి చేస్తాడు. నిర్మాతల దర్శకుడు. సాయి కార్తిక్ మంచి సినిమాలకు పని చేశాడు. దూసుకుపోతున్న యువ కెరటం తను. టీం అందరికి ఆల్ ది బెస్ట్''అని చెప్పారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో కుమార్ నాగేంద్ర, నాగార్జున్, అశోక్, కోడెల శివరాం, వీరేందర్ గౌడ్, కరణం వెంకటేష్,  కాసర్ల శ్యాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement