Advertisementt

శైలజ వలనే వెంకీ సినిమా ఛాన్స్!

Sat 20th Feb 2016 12:44 PM
kishore tirumala,nenu sailaja,ram,venkatesh  శైలజ వలనే వెంకీ సినిమా ఛాన్స్!
శైలజ వలనే వెంకీ సినిమా ఛాన్స్!
Advertisement
Ads by CJ

నేను శైలజ చిత్రాన్ని యాభై రోజులు ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు - కిషోర్ కుమార్ తిరుమల

ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడిగా, కీర్తి సురేష్ కథానయికగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి రవి కిషోర్ నిర్మించిన నేను శైలజ చిత్రం ఘనవిజయం సాధించి విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకుంది. ఓవర్సీస్ ప్రేక్షకులు సైతం ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. 2016 జనవరి 1న విడుదలై అతి పెద్ద హిట్ గా నిలబడి యాభై రోజులు పూర్తి చేసుకొని శతదినోత్సవం జరుపుకునేందుకు పరుగులు పెడుతున్న సందర్భంగా చిత్ర దర్శకుడు కిషోర్ తిరుమల తన ఆనందాన్ని పంచుకున్నారు.  

కిషోర్ తిరుమల మాట్లాడుతూ... ''నేను శైలజ చిత్రాన్ని ఘనవిజయం చేసి మా చిత్ర యూనిట్ కు మంచి గిఫ్ట్ అందించిన తెలుగు ప్రేక్షకులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాభై రోజులు విజయవంతంగా ప్రదర్శింపబడి వంద రోజులకు పయనిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రామ్ ఎనర్జీ, స్రవంతి రవికిషోర్ గారి ప్లానింగ్, ఆర్టిస్టులతో పాటు, టెక్నికల్ టీం ఈ సినిమా కోసం ఎంతగా కష్టపడ్డారో మాటల్లో చెప్పలేను. చిత్ర కథ, కథనం, సంగీతం సినిమాను నిలబెట్టాయి. ఈ సినిమా తర్వాత చిత్ర పరిశ్రమ పెద్దలు చాలా మంది ఆశీర్వదించారు. అలా ప్రస్తుతం వెంకటేష్ గారితో ఓ సినిమా చేయబోతున్నాను. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చివరి దశలో ఉంది. చిత్ర నిర్మాత మల్టీ డైమన్షన్ రామ్మోహన్ రావు గారు నా సెకండ్ హ్యాండ్ సినిమా చేస్తున్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఆయన బ్యానర్ లోనే వెంకటేష్ గారితో సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంత పెద్ద అవకాశాన్నిచ్చిన రామ్మోహన్ రావు గారికి నా ధన్యవాదాలు మార్చి మొదటి వారంలో స్క్రిప్ట్ వర్క్ పూర్తవుతుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాగానే సెట్స్ మీదకు వెళ్లనున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు మార్చి మొదటి వారం తర్వాత ప్రకటిస్తాం. నన్ను ఎంతగానో ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా'' అని అన్నారు.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ