ఈజిప్ట్ బ్యాక్ డ్రాప్ లో ''రైడర్స్ ఆఫ్ లాస్ట్ ఆర్క్'' నుంచి మమ్మీ సిరీస్, క్లియెపాత్రా, ఎక్సోడస్ వరకు ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.. మరలా అదే తరహా లో ఈజిప్ట్ నైపధ్యంలో దర్శకుడు అలెక్స్ ప్రొయాస్ తీసిన చిత్రం ''గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్''. దాదాపు 1400 కోట్ల బడ్జెట్ తో భారీ కాస్టింగ్, సెట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమైంది.. తెలుగులో ఈ సినిమాను కె.ఎఫ్.సి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ విడుదల చేస్తోంది. భారీ ప్రళయం నుంచి ఈజిప్ట్ నగరాన్ని మరియు ప్రపంచాన్ని గాడ్ ఆఫ్ ఈజిప్ట్ గా ఆరాధించబడే హోరస్ ఎలా కాపాడాడు అనే ఆసక్తికర కధాంశంతో టెక్నికల్ వండర్ గా తీసిన ఈ చిత్రం మరో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని ట్రేడ్ సర్కిల్స్ కాన్పిడెన్స్ తో ఉన్నాయి.. గెరార్డ్ బట్లర్, నికొలస్ కొస్టర్,చాడ్విక్ బోస్మన్, కొర్టినీ ఈటన్ తదితరులు నటిస్తోన్న ఈ సినిమాను ప్రపంచ వ్యాపంగా లైన్స్ గెట్ సంస్థ, తెలుగులో కె.ఎఫ్.సి ఎంటర్ టైన్మ్ంట్స్ విడుదల చేస్తున్నాయి.