Advertisementt

కళ్యాణ్ సినీక్రియేషన్స్ నూతన చిత్రం ప్రారంభం!

Thu 18th Feb 2016 01:28 PM
kalyan cine creations,kashyap,sriram balaji,chandini  కళ్యాణ్ సినీక్రియేషన్స్ నూతన చిత్రం ప్రారంభం!
కళ్యాణ్ సినీక్రియేషన్స్ నూతన చిత్రం ప్రారంభం!
Advertisement
Ads by CJ

కాశ్యప్, చాందిని జంటగా కళ్యాణ్ సినీ క్రియేషన్స్ పతాకంపై శ్రీరాం బాలాజీ దర్శకత్వంలో ఎం.జాహ్నవి నిర్మాణంలో నూతన చిత్రం బుధవారం హైదరాబాద్ లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి కిషోర్ పార్థసారథి క్లాప్ కొట్టగా.. బసిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మల్కాపురం శివకుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..

దర్శకుడు శ్రీరాం బాలాజీ మాట్లాడుతూ.. ''నేను డైరెక్ట్ చేసిన 'చిరుజల్లు' సినిమా చూసి నాకు సినిమాకు దర్శకత్వం వహించే అవకాసం ఇచ్చారు. మార్చి మొదటివారం నుండి మొదటి షెడ్యూల్ ప్రారంభించి మే చివరి వారానికి పూర్తి చేసి జూన్ లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇదొక రొమాంటిక్, ఎంటర్టైనర్. సినిమాలో మంచి ఫన్ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా సినిమా ఉంటుంది'' అని చెప్పారు.

నిర్మాత జాహ్నవి మాట్లాడుతూ.. ''ఫ్యామిలీ మొత్తం చూడదగిన సినిమా ఇది. మర్చి నుండి ఏప్రిల్ వరకు కంటిన్యూస్ షూటింగ్ నిర్వహించనున్నాం. ఆ తరువాత పాటల చిత్రీకరణ జరిపి సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. మా బ్యానర్ లో వస్తోన్న మొదటి సినిమా. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

కాశ్యప్ మాట్లాడుతూ.. ''నటన మీద ఆసక్తితో సినిమాల్లోకి అడుగుపెట్టాను. అన్నపూర్ణ స్టూడియోస్ లో యాక్టింగ్ కోర్సు పూర్తి చేశాను. ఈ సినిమా కథ నచ్చి నా తల్లితండ్రులే సినిమాను నిర్మిస్తున్నారు. ఏదో ఒక్క సినిమా చేసి వెళ్ళిపోవాలని లేదు. ఇక్కడే లాంగ్ లైఫ్ ఉండాలని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

బంటి మాట్లాడుతూ.. ''సినిమాకు మంచి ట్యూన్స్ కుదిరాయి. అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంది. మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. యూత్ కి ఆసక్తి కలిగేలా పాటలను కంపోజ్ చేస్తున్నాం. సుద్దాల అశోక్ తేజ, రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి వంటి వారు సాహిత్యాన్ని అందిస్తున్నారు'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమ్మలో చాందిని, పావని, కాశి విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సినిమాకు మూల‌క‌థః క‌ళ్యాణ్‌, క‌థ‌, మాట‌లుః మ‌ల్కార్ శ్రీనివాస్‌, పాట‌లుః సుద్దాల అశోక్‌తేజ‌, రామ‌జోగ‌య్య‌శాస్త్రి, శ్రీమ‌ణి, బ‌ల‌భ‌ద్ర‌పాత్రుని మ‌ధు, సంగీతంః బంటి, సినిమాటోగ్ర‌ఫీః వంశీకృష్ణ‌, ఎడిట‌ర్ః ఎస్‌.బి.ఉద్ధ‌వ్‌, డ్యాన్స్ః నిక్స‌న్ డి క్రూజ్‌, ఫైట్స్ః డ్రాగ‌న్ ప్ర‌కాష్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః శ్రీమ‌తి ఎం.జాహ్న‌వి, నిర్మాతః ఎం.జాహ్న‌వి, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వంః శ్రీరామ్ బాలాజీ. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ