ఐ-ఫాంటసీ డిజైన్ స్టూడియోస్ బ్యానర్ లో శివ, సదాఫ్ లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ.. నవీన్ జోయల్, నిఖిల్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'క్రేజీ లవ్'. యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్ర టీజర్ ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలయింది. టీజర్ కు ప్రేక్షకుల నుండి ఆశేష స్పందన లభించడం తో నిర్మాతలు, దర్శకుడు సినిమా పై ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లవ్ లో ఉండటాన్ని క్రేజీగా ఫీలవుతున్న యూత్.. లవ్ కి, లస్ట్ కి మధ్య ఉన్న తేడాని గుర్తించకుండా రెండు ఒకటేలాగా ఫీలవుతున్నారు. వీటి మధ్య వ్యత్యాసాన్ని వినోదాత్మకంగా చూపుతూ ప్యూర్ లవ్ నీ ఫీలయినప్పుడు కలిగే సంతోషాన్ని చూపించేదే మా 'క్రేజీ లవ్'. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేసిన మా చిత్ర టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.టీజర్ కి వచ్చిన స్పందన మాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పూర్తి స్థాయి వినోదంతో నిర్మించబడుతున్న ఈ 'క్రేజీ లవ్' చిత్రాన్ని జులై 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము..అని తెలిపారు.
శివ, సదాఫ్ మొదలగువారు నటించిన ఈ చిత్రానికి బ్యానర్: ఐ ఫాంటసీ డిజైన్ స్టూడియోస్, సంగీతం: జాస్ కందుల, నిర్మాత: నవీన్ జోయల్, నిఖిల్, రచన-దర్శకత్వం: శ్రీనాథ్ రెడ్డి.