Advertisementt

1000 థియేటర్లలో 'శౌర్య' రిలీజ్!

Mon 15th Feb 2016 08:27 PM
shourya movie release date,dasarath,manchu manoj,sivakumar malkapuram  1000 థియేటర్లలో 'శౌర్య' రిలీజ్!
1000 థియేటర్లలో 'శౌర్య' రిలీజ్!
Advertisement
Ads by CJ

మంచు మనోజ్ రెజీనా జంటగా బేబి త్రిష సమర్పణలో సురక్ష్ ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి.బ్యానర్ పై దశరథ్ దర్శకత్వంలో శివకుమార్ మల్కాపురం నిర్మిస్తున్న చిత్రం 'శౌర్య'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మర్చి 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా..

మంచు మనోజ్ మాట్లాడుతూ.. ''ఇటీవల విడుదలయిన సినిమా పాటలకు మంచి స్పందన లభిస్తోంది. దాంతో మాలో సినిమాపై కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. మార్చి 4న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమా ద్వారా వేద అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ పరిచయం కాబోతున్నాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు బావున్నాయి. దసరథ్ సినిమా స్టొరీ చెప్పినప్పుడు ఫస్ట్ సిట్టింగ్ లోనే కథను ఓకే చేసేశాను. త్వరలోనే సినిమా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేయనున్నాం'' అని చెప్పారు.

దసరథ్ మాట్లాడుతూ.. ''సినిమా ట్రైలర్ కు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మార్చి 4న సినిమాను రిలీజ్ చేస్తున్నాం. నాకు, ప్రొడ్యూసర్ గారి మధ్య స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీశారు. అందరూ బాగా ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాం'' అని చెప్పారు.

నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. ''వేదకు మొదటి సినిమా అయినా మంచి ట్యూన్స్ అందించాడు. ఇదివరకు మా బ్యానర్ లో డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్ ను పరిచయం చేశాం. ఈ సినిమా ద్వారా మరో మ్యూజిక్ డైరెక్టర్ పరిచయం కాబోతున్నాడు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేయాలని సినిమా మొదలుపెట్టాం. అవుట్ పుట్ బాగా వచ్చింది. సుమారుగా ప్రపంచవ్యాప్తంగా 1000 థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తున్నాం. బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఫ్యాన్సీ రేట్లకు సినిమాను కొనుకున్నారు. అందరికి లాభాలు రావాలని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో వరికుప్పల యాదగిరి, వేద, ప్రభాస్ శ్రీను, కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.   

ఈ చిత్రానికి స్టంట్స్: వెంకట్, కొరియోగ్రఫీ: భాను, ఆర్ట్: హరిబాబు, రచనా సహకారం: హరికృష్ణ, సాయికృష్ణ, స్క్రీన్ ప్లే: గోపు కిషోర్, రచన: గోపి మోహన్;, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: వేదా.కె, సినిమాటోగ్రఫీ: మల్హర్ భట్ జోషి, నిర్మాత: శివకుమార్ మల్కాపురం, దర్శకత్వం: దశరథ్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ