Advertisementt

'గరం' మూవీ సక్సెస్ మీట్!

Mon 15th Feb 2016 04:10 PM
garam movie success meet,aadi,saikumar,madan  'గరం' మూవీ సక్సెస్ మీట్!
'గరం' మూవీ సక్సెస్ మీట్!
Advertisement
Ads by CJ

ఆది, ఆదాశర్మ జంటగా శ్రీమతి వసంత శ్రీనివాస్ సమర్పణలో శ్రీనివాసాయి స్క్రీన్స్ పతాకంపై మదన్ దర్శకత్వంలో పి.సురేఖ నిర్మించిన చిత్రం 'గరం'. ఫిబ్రవరి 12న విడుదలయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం సోమవారం హైదరాబాద్ లోని సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..

దర్శకుడు మదన్ మాట్లాడుతూ.. ''సినిమా మొదటి ఆట ప్రేక్షకుడు దేవుడితో సమానం. తన మౌత్ టాక్ తోనే సినిమా నడుస్తుంది. మేము రూపొందించిన 'ఆ నలుగురు' సినిమాకు మొదటి రెండు వారాలు కలెక్షన్స్ లేవు. మూడవ వారానికి కలెక్షన్స్ రావడం మొదలుపెట్టాయి. అలానే 'గరం' సినిమా కూడా మౌత్ టాక్ తో రెండు రోజుల నుండి వైరస్ స్ప్రెడ్ అయినట్లుగా జనాల్లోకి వెళ్ళిపోయింది. సినిమా కోసం నెగటివ్ గా ఒక్కరు కూడా చెప్పలేదు. తెరపైన ఆది హీరో అయితే తెర వెనుక హీరో సాయి కుమార్ గారు. ఆయన చాలా అలెర్ట్ గా ఉంటారు. ఆ నలుగురు సినిమాలో రఘురాం పాత్ర అందరికి ఎలా గుర్తుండిపోతుందో.. ఈ సినిమాలో వరాలబాబు పాత్ర అలా గుర్తుండిపోతుంది'' అని చెప్పారు.

ఆది మాట్లాడుతూ.. ''మాస్ హీరోగా ప్రేక్షకులు నన్ను ఆదరిస్తారనే నమ్మకంతో సినిమా చేశాను. థియేటర్ లో సినిమాకు వచ్చే రెస్పాన్స్ చూసి చాలా సంతోషంగా అనిపించింది. మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాననే నమ్మకం నాలో ఏర్పడింది. సినిమా టాక్ రోజురోజుకి పెరుగుతుందే కాని తగ్గదు. ఇంకా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

సాయికుమార్ మాట్లాడుతూ.. ''సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి ఓపెనింగ్స్ తో మొదలయ్యి ఈరోజుకి కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. నిన్నటికంటే ఈరోజు కలెక్షన్స్ పెరిగాయి. మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్'' అని చెప్పారు.  

ఇంకా ఈ కార్యక్రమంలో చైతన్య కృష్ణ, నరేష్, అగస్త్య, అదా శర్మ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి కథ,మాటలు-శ్రీనివాస్ గవిరెడ్డి, పాటలు: భాస్కర్ భట్ల, చైతన్య ప్రసాద్, శ్రీమణి, పులగం చిన్నారాయణ, కోరియోగ్రఫీ: శేఖర్, జాని, విద్యాసాగర్, ఫైట్స్: థ్రిల్లర్ మంజు, వెంకట్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: టి.సురేందర్ రెడ్డి, సంగీతం: అగస్త్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబ్జి, నిర్మాత: పి.సురేఖ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మదన్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ