Advertisementt

ఊపిరి షూటింగ్‌ పూర్తి, మార్చిలో విడుదల

Mon 15th Feb 2016 12:07 PM
telugu movie oopiri,nagarjuna and karthi in oopiri,ooprii shooting completed,oopiri movie releasing in march,oopiri audio release in february ending,oopiri director vamsi paidipally  ఊపిరి షూటింగ్‌ పూర్తి, మార్చిలో విడుదల
ఊపిరి షూటింగ్‌ పూర్తి, మార్చిలో విడుదల
Advertisement
Ads by CJ
సోగ్గాడే చిన్ని నాయనా వంటి సూపర్‌హిట్‌ చిత్రంతో 50 కోట్ల క్లబ్‌లో చేరిన కింగ్‌ నాగార్జున, ఆవారా కార్తీ, మిల్కీబ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో పెరల్‌ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై బృందావనం, ఎవడు వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నే నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్‌ ఊపిరి. ఈ చిత్రానికి సంబంధించిన టోటల్‌ షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మార్చిలో విడుదల చేయడానికి నిర్మాత ప్రసాద్‌ వి. పొట్లూరి సన్నాహాలు చేస్తున్నారు. 
మా పి.వి.పి. సంస్థలో ఊపిరి ఓ ప్రతిష్ఠాత్మక చిత్రమవుతుంది 
ఈ సందర్భంగా నిర్మాత ప్రసాద్‌ వి. పొట్లూరి మాట్లాడుతూ  ఫ్రాన్స్‌, బల్గేరియా, స్లోవేనియా వంటి ప్రాంతాల్లో ఇప్పటివరకు ఎవ్వరూ షూట్‌ చెయ్యని లొకేషన్స్‌లో ఈ చిత్రాన్ని షూట్‌ చెయ్యడం జరిగింది. షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. డెఫినెట్‌గా నాగార్జునగారి కెరీర్‌లో ఊపిరి మరో మెమరబుల్‌ మూవీ అవుతుంది. అలాగే కార్తీ ఫస్ట్‌ టైమ్‌ తెలుగులో చేస్తున్న ఈ స్ట్రెయిట్‌ సినిమా అతని కెరీర్‌లో మరో మంచి చిత్రమవుతుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం మా పివిపి సంస్థలో మరో ప్రతిష్ఠాత్మక చిత్రమవుతుంది. ఈ చిత్రం ఆడియోను ఫిబ్రవరి నెలాఖరులో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మార్చిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం అన్నారు. 
ఊపిరి ఓ కలర్‌ఫుల్‌ సెలబ్రేషన్‌లా వుంటుంది 
దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ  ఇద్దరు వేర్వేరు వ్యక్తుల మధ్య ఏర్పడిన స్నేహం, తద్వారా జరిగే ఓ ఎమోషనల్‌ జర్నీ ప్రధానాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమా ఓ కలర్‌ఫుల్‌ సెలబ్రేషన్‌లా వుండబోతోందని, అందరికీ సంతోషాన్ని పంచే చక్కని చిత్రం అవుతుందన్న పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ వస్తున్నాయి. నాగార్జునగారు, కార్తీ స్నేహితులుగా ఎక్స్‌ట్రార్డినరీగా పెర్‌ఫార్మ్‌ చేశారు. అన్ని వయసుల వారిని ఎంటర్‌టైన్‌ చేసేలా ఈ చిత్రం రూపొందుతోంది అన్నారు. 
కింగ్‌ నాగార్జున, ఆవారా కార్తీ, తమన్నా భాటియా, సహజనటి జయసుధ, ప్రకాష్‌రాజ్‌, కల్పన, ఆలీ, తనికెళ్ళ భరణిలతోపాటు ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్‌కు సంగీతం: గోపీసుందర్‌, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, ఎడిటింగ్‌: మధు, ఫైట్స్‌: కలోయిన్‌ ఒదెనిచరోవ్‌, కె.రవివర్మ, సిల్వ, డాన్స్‌: రాజు సుందరం, బృంద, స్టోరీ అడాప్షన్‌: వంశీ పైడిపల్లి, సాల్మన్‌, హరి, మాటలు: అబ్బూరి రవి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: సునీల్‌బాబు, సమర్పణ: పెరల్‌ వి.పొట్లూరి, నిర్మాతలు: పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నే, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ