Advertisementt

'కృష్ణగాడి..'పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం!

Thu 11th Feb 2016 05:42 PM
krishnagadi veera premagada,nani,hani raghavapudi  'కృష్ణగాడి..'పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం!
'కృష్ణగాడి..'పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం!
Advertisement
Ads by CJ

ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై యంగ్ హీరో నాని, మెహరీన్(నూతన పరిచయం) హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'కృష్ణగాడి వీర ప్రేమగాథ'. హను రాఘవపూడి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హైదరబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..

గోపి ఆచంట మాట్లాడుతూ.. ''ఈ సినిమాను ఎక్కువగా ఉరవకొండ, మోపిడి, రాకెట్ల ప్రాంతాల్లో చిత్రీకరించాం. మాకు సహకరించిన ఆ ప్రాంత ప్రజలకు థాంక్స్. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 12న విడుదల కానుంది. యు.ఎస్ లో ఈ చిత్రాన్ని 130 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నాం'' అని చెప్పారు.

అనిల్ సుంకర మాట్లాడుతూ.. ''ఇదొక వైబ్రంట్ కలర్ ఫుల్ లవ్ స్టొరీ. నాని నటన పరంగా తన కెరీర్ లోనే బెస్ట్ మూవీ అవుతుంది. ఒక హీరోగా మొత్తం సినిమాను నడిపించాడు. చాలా హార్డ్ వర్క్ చేశాడు. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

హను రాఘవపూడి మాట్లాడుతూ.. ''సంవత్సరం కాలంగా ఈ సినిమా గురించే వర్క్ చేశాం. రేపటి నుండి ఈ టీం కు దూరంగా ఉండాలంటే చాలా బాధగా ఉంది. ఎమోషనల్ ఫీల్ అయ్యాను. కృష్ణ పాత్ర అందరికి కనెక్ట్ అవుతుంది. ఫుల్ లెంగ్థ్ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందించాం. సర్ప్రైజింగ్ గా ఉంటుంది. ఖచ్చితంగా అందరి ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవుతుంది. మంచి స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ. సినిమాలో చాలా టర్న్స్ ఉంటాయి. అందరూ ఎఫోర్ట్ పెట్టి చేసిన సినిమా'' అని చెప్పారు.

నాని మాట్లాడుతూ.. ''సినిమా షూటింగ్ అప్పుడే అయిపోయిందా..? అనే ఫీలింగ్ కలుగుతుంది. రేపే సినిమా రిలీజ్ అవుతుంది. చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాను. కాన్ఫిడెంట్ గా కూడా ఉన్నాం. సినిమాపై పాజిటివ్ బాజ్ క్రియేట్ అయింది. యువరాజ్ ఫోటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. మహాలక్ష్మి పాత్రలో మేహ్రీన్ కన్విన్సింగ్ గా నటించింది. సినిమా చేసే ప్రాసెస్ లో హను బాగా క్లోజ్ అయిపోయాడు. హను కోసం ఈ సినిమా పెద్ద బ్లాక్ బాస్టర్ కావాలి'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో యువరాజ్, కె.కె, రామ్ ఆచంట, మేహ్రీన్ తదితరులు పాల్గొన్నారు. 

ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఎడిటింగ్: గౌతం రాజు, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: హను రాఘవపుడి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ