మధుమిత, శివ, వరుణ్ ప్రధాన పాత్రల్లో నరసింహ నంది దర్శకత్వంలో శ్రీ లక్ష్మి నరసింహ సినిమా పతాకంపై నిర్మించిన చిత్రం 'లజ్జ'. బూచేపల్లి తిరుపతి రెడ్డి నిర్మాత. ఇటీవల విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ మధుమిత విలేకర్లతో ముచ్చటించారు.
''నేను పెరిగింది హైదరాబాద్ లోనే. బి.ఎస్.సి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. ప్రస్తుతం ఎల్.ఎల్.బి చేస్తున్నాను. నా స్కూలింగ్ టైంలోనే కూచిపూడి నేర్చుకున్నాను. రెండు సంవత్సరాల పాటు కథక్ నేర్చుకున్నాను. స్టేజ్ షోస్ కూడా ఇచ్చాను. ఆ క్రమంలోనే రోషన్ తనేజా యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో నటన మీద శిక్షణ తీసుకున్నాను. 'మొగుడు' సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెల్సి వెళ్లి అటెండ్ అయ్యాను. ఆ సినిమాలో చిన్న రోల్ లో నటించే అవకాశం వచ్చింది. 'గరం' మూవీ కో డైరెక్టర్ అనిల్, నరసింహ నంది గారు సినిమా చేస్తున్నారని వెళ్లి కలవమని చెప్పారు. ఆ సమయంలో ఆయనొక ఎంటర్టైనింగ్ సినిమా చేస్తున్నారు. అయితే నెక్స్ట్ ఒక లేడీ ఓరియెంటెడ్ ఫిలిం చేస్తున్నాని ఆ సినిమాలో చాన్స్ ఇస్తానని చెప్పారు. రెండు నెలల తరువాత ఫోన్ చేసి 'లజ్జ' సినిమాలో నటించమని అడిగారు. మొదట సినిమా షూటింగ్ జరిగేప్పుడు ఇలాంటి రోల్ లో నేను నటించగలనా..? అనే అనుమానం కలిగింది. మొదట షాట్ అవ్వగానే అందరూ క్లాప్స్ కొట్టి సౌందర్యలా నటించావని చెప్పారు. నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇలాంటి బోల్డ్ సీన్స్ లో నటించడానికి టబు, షబానాలే నా ఇన్స్పిరేషన్. ఫిబ్రవరి 5న రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. నరసింహ నంది గారు ఎప్పుడు సినిమాల గురించే ఆలోచిస్తుంటారు. సినిమాను ఇంకా బాగా ఎలా ప్రెజంట్ చేయొచ్చని ఆలోచించేవారు. ఇలాంటి సినిమాలు ఆయన మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం మోహన్ లాల్ గారితో ఓ మలయాళ సినిమాలో నటిస్తున్నాను. అందులో యంగ్ అమ్మాయి పాత్రలో, 70 ఏళ్ళ వృద్దురాలి పాత్రలో నటిస్తున్నాను. అది కాకుండా గౌతం అనే కొత్త డైరెక్టర్ తో మరో సినిమాలో నటిస్తున్నాను'' అని చెప్పారు.