Advertisementt

'రాజుగారింట్లో 7వ రోజు' రిలీజ్ డేట్ ఖరారు!

Wed 10th Feb 2016 04:14 PM
rajugarintlo 7va roju,releasing on february 26th,bharath,feroj raja  'రాజుగారింట్లో 7వ రోజు' రిలీజ్ డేట్ ఖరారు!
'రాజుగారింట్లో 7వ రోజు' రిలీజ్ డేట్ ఖరారు!
Advertisement
Ads by CJ

అజయ్, భరత్, అర్జున్, వెంకటేష్, సుష్మిత ప్రధాన పాత్రల్లో భరత్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ఫిరోజ్ రాజ దర్శకత్వంలో భరత్ కుమార్ పీలం నిర్మిస్తున్న సినిమా 'రాజుగారింట్లో 7వ రోజు'. ఈ సినిమాను ఫిబ్రవరి 26న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా..

శోభారాణి మాట్లాడుతూ.. ''ఈ సినిమాను చూసి థ్రిల్ ఫీల్ అయ్యాను. క్లైమాక్స్ చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది. కొత్త వాళ్లయినా.. న్యాచురల్ గా నటించారు. ఫిబ్రవరి 26న సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాను మా సంస్థ ద్వారా రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది'' అని చెప్పారు. 

నిర్మాత భరత్ మాట్లాడుతూ.. ''మూవీ అవుట్ పుట్ బాగా వచ్చింది. ఇదొక హారర్, క్రైమ్, కామెడీ థ్రిల్లర్. సినిమా ప్రమోషనల్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆర్టిస్ట్స్ అందరు బాగా సపోర్ట్ చేశారు. సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకొని యు/ఏ సర్టిఫికేట్ పొందింది'' అని చెప్పారు.

దర్శకుడు ఫిరోజ్ రాజ మాట్లాడుతూ.. ''క్రైమ్ ఆధారంగా రూపొందించిన ఓ హారర్ ఫిలిం ఇది. స్క్రీన్ ప్లే చాలా బావుంటుంది. ప్రతి ఒక్కరు కష్టపడి ఈ సినిమా చేశారు. ఎస్.వి.ఆర్ మీడియా అధినేత్రి శోభారాణి గారు మాకు సపోర్ట్ చేయడం ఆనందంగా ఉంది'' అని చెప్పారు. 

ఈ చిత్రానికి నిర్మాత: భరత్ కుమార్ పీలం, రచన,దర్శకత్వం: ఫిరోజ్ రాజ, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: క్రాంతి కె.కుమార్, మ్యూజిక్: కనిష్క్, ఎడిటర్: అనిల్, స్టిల్స్: నాగభూషణం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ