Advertisementt

ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేయను:ఆది

Wed 10th Feb 2016 01:52 PM
garam movie press meet,saikumar,aadi,adah shrma  ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేయను:ఆది
ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేయను:ఆది
Advertisement

ఆది, ఆదాశర్మ జంటగా శ్రీమతి వసంత శ్రీనివాస్ సమర్పణలో శ్రీనివాసాయి స్క్రీన్స్ పతాకంపై మదన్ దర్శకత్వంలో పి.సురేఖ నిర్మిస్తున్న చిత్రం 'గరం'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో..

సాయికుమార్ మాట్లాడుతూ.. ''ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. ఫీల్ గుడ్ ఫిలిం. ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలానే సినిమాను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

ఆది మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో సీనియర్ ఆర్టిస్ట్స్ తో కలిసి వర్క్ చేయడం సంతోషంగా అనిపించింది. సినిమా బాగా వచ్చింది. సినిమాపై మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఫిబ్రవరి 12న సినిమా రిలీజ్ అవుతోంది. సినిమా చూసిన ప్రేక్షకులు మాత్రం డిసప్పాయింట్ అవ్వరు'' అని చెప్పారు.

మదన్ మాట్లాడుతూ.. ''నేనొక డైరెక్టర్ అని చెప్పుకోగలను కాని రచయిత అని మాత్రం చెప్పుకోలేను. దానికి నేను అర్హుడుని కానేమో అనిపిస్తుంది. తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి లాంటి రచయితలతో కలిసి పని చేయడం సంతోషంగా అనిపించింది. 'గరం' టైటిల్ లోనే మల్టిపుల్ ఎక్స్ ప్రెషన్స్ ఉన్నాయి. కమర్షియల్ గా కూడా టైటిల్ బావుందని పెట్టుకున్నాం. సాయికుమార్ గారు క్రియేటివ్ ఫ్రీడం ఇచ్చారు. నా దృష్టిలో ఈ సినిమా సక్సెస్ అయిందనే అనుకుంటున్నాను. ప్రేక్షకుల నుండి వచ్చే అప్లాజ్ గురించి ఎదురు చూస్తున్నాను'' అని చెప్పారు.

శ్రీనివాస్ గవిరెడ్డి మాట్లాడుతూ.. ''ఇదొక కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. కొత్త పాయింట్ తీసుకొని సినిమా చేశాం. ఆది కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలుస్తుంది. మదన్ గారి స్టైల్ లో సినిమాను కొత్తగా ప్రెజంట్ చేశారు. సినిమా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో అదా శర్మ,తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, నాజర్, పృథ్వి, చైతన్య కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి కథ,మాటలు-శ్రీనివాస్ గవిరెడ్డి, పాటలు: భాస్కర్ భట్ల, చైతన్య ప్రసాద్, శ్రీమణి, పులగం చిన్నారాయణ, కోరియోగ్రఫీ: శేఖర్, జాని, విద్యాసాగర్, ఫైట్స్: థ్రిల్లర్ మంజు, వెంకట్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: టి.సురేందర్ రెడ్డి, సంగీతం: అగస్త్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబ్జి, నిర్మాత: పి.సురేఖ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మదన్.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement