Advertisementt

'మీకు మీరే మాకు మేమే' ఆడియో లాంచ్!

Tue 09th Feb 2016 02:49 PM
meeku meere maku meme audio launch,hussain sha kiran,tarun shetty,avanthika  'మీకు మీరే మాకు మేమే' ఆడియో లాంచ్!
'మీకు మీరే మాకు మేమే' ఆడియో లాంచ్!
Advertisement
Ads by CJ

తరుణ్ శెట్టి, అవంతిక, కిరిటీ దామరాజు, జెన్ని, భరణ్ ప్రధాన పాత్రల్లో నకమా ప్లానెట్ గ్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'మీకు మీరే మాకు మేమే'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం హైదరాబాద్ లో జరిగింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ బిగ్ సీడీను, ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి కాపీను సుకుమార్ కు అందించారు. థియేట్రికల్ ట్రైలర్ ను సుకుమార్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా..

అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ''హుస్సేన్ షా డైరెక్ట్ చేసిన కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చూసి స్టన్ అయిపోయాను. ఇప్పటివరకు నేను అలాంటి షార్ట్ ఫిల్మ్స్ చూడలేదు. అప్పటివరకు సినిమా చూడమని వాళ్ళు నా వెంటపడితే సినిమా చూసిన తరువాత నేను వెంటపడడం మొదలుపెట్టాను. ఉద్యోగాలు వొదిలేసి ఎంతో ప్యాషనేట్ తో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. సుకుమార్ దగ్గర కొంతకాలం పని చేశారు. రీసెంట్ గా సుకుమార్ డైరెక్ట్ చేసిన 'నాన్నకు ప్రేమతో' సినిమా చూసి తనను ఆఫీస్ కు పిలిపించి ఏప్రిల్ నుండి మా బ్యానర్ లో సినిమా చేయమని అడిగాను. తను కూడా ఓకే అన్నాడు. ఇక ఈ సినిమా విషయానికొస్తే సినిమా రషెస్ చూశాను. అందరు చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. హుస్సేన్ రెండు, మూడు సిట్టింగ్స్ లోనే మా బ్యానర్ లో సినిమా చేసే ఛాన్స్ సంపాదించాడు. తన మూడో సినిమాను మా బ్యానర్ లో చేయాలనుకుంటున్నాం. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

సుకుమార్ మాట్లాడుతూ.. ''హుస్సేన్ చిన్న చిన్న క్యారెక్టర్స్ లో నటిస్తూ.. షూటింగ్ లో ఏం జరుగుతుంది..? ఎలా డైరెక్ట్ చేయాలి..? ఇలా అన్ని విషయాలు నేర్చుకున్నాడు. తను డైరెక్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూసి నేను చాలా జెలస్ ఫీల్ అయ్యాను. ఇంత లాజిక్ గా ఎలా తీసాడని..? నా మొహం మాడిపోయింది. నేను డైరెక్ట్ చేసిన 'నాన్నకు ప్రేమతో' సినిమా చూసి ఏ హాలీవుడ్ సినిమా నుండి సుకుమార్ కాపీ కొట్టాడో.. అని చాలా మందికి అనుమానాలు వచ్చాయి. నేను కాపీ కొట్టింది హుస్సేన్ దగ్గర నుండే.. భవిష్యత్తులో తను మంచి ప్రామిసింగ్ డైరెక్టర్ అవుతాడు. తను నా శిష్యుడు అంటున్నారు కాబట్టి సుకుమార్ రైటింగ్స్ లో ఖచ్చితంగా తనొక సినిమా చేస్తాడు. శ్రవణ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

హుస్సేన్ షా కిరణ్ మాట్లాడుతూ.. ''నా ఫ్యామిలీ సపోర్ట్ తోనే ఈ స్థానంలో ఉన్నాను. ఫ్యామిలీతో పోటీగా పరిచయంలేని సపోర్ట్ చేసారంటే అది అల్లు అరవింద్ గారే.. షార్ట్ ఫిల్మ్స్ చేసేప్పుడే సినిమా చేయాలనుకున్నాం. ఎలా చేయాలి..? ఎలా వెళ్ళాలో నేర్పింది అల్లు అరవింద్, సుకుమార్ లే.. ననంకు ప్రేమతో సినిమాకు ఒక చిన్న ఐడియా మాత్రమే ఇచ్చాను. దానిని బేస్ చేసుకొని సంవత్సరంన్నర దానికోసం వర్క్ చేశారు. టైటిల్స్ లో నాపేరే మొదటిగా వేశారు. సుకుమార్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటాను. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే ప్రతి అబ్బాయి కంటే అమ్మాయి చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తుంది. అమ్మాయిల కంటే అబ్బాయిల మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ. ప్రతి మగాడిలో చైల్డిష్ నెస్ ఉంటుంది. ప్రేమ తరువాత జీవితం ఎలా ఉంటుందనేదే ఈ సినిమా. ఈ సినిమా బాగా రావడానికి కారణం మా టీం అందరూ చేసిన ఎఫర్ట్. శ్రవణ్ మ్యూజిక్ చాలా బాగా చేశాడు. పాటలు, సినిమా అందరికి నచ్చే విధంగా ఉంటుంది'' అని చెప్పారు.

ఈ చిత్రానికి ఆర్ట్: అభిషేక్ రాఘవ్, మనీషా, రామ్ గోపాల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కార్తీక్ వంశీ తాడేపల్లి, సినిమాటోగ్రఫీ: సూర్య వినయ్, మ్యూజిక్: శ్రవణ్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, ప్రొడక్షన్: ఎన్.పి.జి స్టూడియో, కథ, స్కీన్ ప్లే, దర్శకత్వం: హుస్సేన్ షా కిరణ్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ