Advertisementt

రెడీ ఫర్ రిలీజ్:'అప్పుడలా ఇప్పుడిలా'!

Tue 09th Feb 2016 02:22 PM
appudala ippudila movie,releasing on february 19th,pradeep kumar jampa  రెడీ ఫర్ రిలీజ్:'అప్పుడలా ఇప్పుడిలా'!
రెడీ ఫర్ రిలీజ్:'అప్పుడలా ఇప్పుడిలా'!
Advertisement
Ads by CJ

సూర్యతేజ, హర్షికా పూంచా హీరో హీరోయిన్లుగా దుహ్రా మూవీస్ సమర్పణలో, జంపా క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం 'అప్పుడలా ఇప్పుడిలా'. కె.ఆర్.విష్ణు దర్శకుడు. ప్రదీప్ కుమార్ జంపా నిర్మాత. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ చిత్ర పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. చిత్ర ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో డిస్ట్రిబ్యూటర్స్ చిత్రం మీద ఆసక్తి కనబరిచారు. చిన్న చిత్రాల్లో మంచి బిజినెస్ చేసుకుంటున్న ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఫిబ్రవరి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా... 

నిర్మాత ప్రదీప్ కుమార్ జంపా మాట్లాడుతూ... ''మా బ్యానర్ కి మంచి పేరు తెచ్చే చిత్రమవుతుంది. డైరెక్టర్ విష్ణు ప్రతి సన్నివేశాన్ని బాగా డిజైన్ చేశారు. బ్రహ్మారెడ్డిగారు మంచి కథను అందించారు. ఇటీవల విడదల చేసిన ట్రైలర్ కి పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సునీల్ కశ్యప్ గారు అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలుస్తాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఫిబ్రవరి 19న అత్యధిక థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నాం'' అని అన్నారు.

దర్శకుడు కె.ఆర్.విష్ణు మాట్లాడుతూ... ''ఈ సినిమాతో దర్శకుడిగా అవకాశం ఇచ్చిన ప్రదీప్ గారికి చాలా థాంక్స్. నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా మంచి క్వాలిటీ చిత్రాన్ని నిర్మించారు. మంచి ప్రేమ కథను ఎంటర్ టైనింగ్ గా చెప్పాం. ప్రేమ కథా చిత్రాల్లో ప్రత్యేకమైన చిత్రంగా గుర్తింపు లభిస్తుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ట్రైలర్ విడుదలైన తర్వాతి నుంచి ట్రేడ్ వర్గాల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. దానికి తగ్గట్టుగానే మంచి బిజినెస్ జరుగుతోంది. సుమన్, నరేష్, సూర్యతేజ, హర్షికా పూంచా తో సహా ప్రతి ఆర్టిస్ట్, టెక్నిషియన్ బాగా సపోర్ట్ చేశారు. అందరికీ థాంక్స్. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి...ఫిబ్రవరి 19న మీ ముందుకు వస్తున్నాం'' అని అన్నారు.

సుమన్, నరేష్, సుధ, సంగీత, శివారెడ్డి, పృథ్వీ, సుప్రీత్, ప్రభాష్ శ్రీను, వేణు, సుడిగాలి సుధీర్, ఫిష్ వెంకట్, జోష్ రవి, అనంత్, మెల్కోటే, జబర్దస్త్ రాము, ఫణి, చంటి తదితరులు ఇతర తారాగణం. 

ఈ చిత్రానికి నిర్మాత: ప్రదీప్ కుమార్ జంపా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.ఆర్.విష్ణు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ