Advertisementt

'మీకు మీరే మాకు మేమే' టీజర్ లాంచ్!

Fri 05th Feb 2016 01:36 PM
meku mere maku meme teaser launch,tarun shetty,hussain sha kiran  'మీకు మీరే మాకు మేమే' టీజర్ లాంచ్!
'మీకు మీరే మాకు మేమే' టీజర్ లాంచ్!
Advertisement
Ads by CJ

తరుణ్ శెట్టి, అవంతిక, కిరిటీ దామరాజు, జెన్ని, భరణ్ ప్రధాన పాత్రల్లో నకమా ప్లానెట్ గ్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'మీకు మీరే మాకు మేమే'. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో.. 

ద‌ర్శ‌కుడు హుస్సేన్ షా కిర‌ణ్ మాట్లాడుతూ.. ''మేమంతా ఇంజనీరింగ్ చదివి సినిమాల మీద ప్యాషన్ తో ఇక్కడకు వచ్చాం. షార్ట్ ఫిలింస్ తో జర్నీ స్టార్ట్ చేసి, ఇప్పుడు ఫీచర్ ఫిలి స్థాయికి వచ్చాం. తెలుగు సినిమా క్లాసిక్ మిస్స‌మ్మ చిత్రం లోని ఓ సీన్ ని ఇన్స్పైర్ అయ్యి ఈచిత్రాన్ని చేశాను. ఈ సినిమా అందరికి న‌చ్చుతుంది. చ‌క్క‌టి ప్రేమ క‌థ అందులో చిన్న ఫీల్ తో స్క్రీన్ ప్లే ఉంటుంది. ప్రేమకు నిర్వచనాన్ని ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. దాన్ని అసలు డిఫైన్ చేయలేం. కాని మాకు తెలిసిన రీతిలో ప్రేమకు నిర్వచనాన్ని చెప్పాం. ఇద్దరు కాంప్లికేటెడ్ వ్యక్తులు మధ్య నడిచే లవ్ స్టోరీ ఇది. అల్లు అరవింద్ గారు మా టీంకు ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే ఆయన సపోర్ట్ తోనే సుకుమార్ గారిని కలిశాను. నాన్నకు ప్రేమతో కథను అందించాను. మా ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది'' అని అన్నారు.

ఎగ్జిక్టూటివ్ ప్రొడ్యూసర్ కార్తీక్ వంశీ తాడేపల్లి మాట్లాడుతూ.. ''ఏడు సంవత్సరాల్లో 45 మంది వ్యక్తులు కలిసి చేసిన కష్టమిది. మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం'' అని అన్నారు.

హీరో తరుణ్ శెట్టి మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో హీరోగా నటించడం ఆనందంగా ఉంది. దర్శకుడు అందించిన ప్రోత్సాహం, మంచిటీం ఎఫర్ట్ తో మంచి అవుట్ పుట్ రాబట్టగలిగాం. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం'' అని అన్నారు.

ఈ చిత్రానికి ఆర్ట్: అభిషేక్ రాఘవ్, మనీషా, రామ్ గోపాల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కార్తీక్ వంశీ తాడేపల్లి, సినిమాటోగ్రఫీ: సూర్య వినయ్, మ్యూజిక్: శ్రవణ్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, ప్రొడక్షన్: ఎన్.పి.జి స్టూడియో, కథ, స్కీన్ ప్లే, దర్శకత్వం: హుస్సైన్ షా కిర‌ణ్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ