Advertisementt

'కృష్ణగాడి వీరప్రేమ గాధ' రిలీజ్ డేట్ ఖరారు!

Thu 04th Feb 2016 04:45 PM
krishnagadi veeraprema gadha,february 12th release,nani  'కృష్ణగాడి వీరప్రేమ గాధ' రిలీజ్ డేట్ ఖరారు!
'కృష్ణగాడి వీరప్రేమ గాధ' రిలీజ్ డేట్ ఖరారు!
Advertisement
Ads by CJ

నాని, మెహ్రెన్ కౌర్ జంటగా హను రాఘవపుడి దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'కృష్ణగాడి వీరప్రేమ గాథ'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్ లోని విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో..

గోపీచంద్ ఆచంట మాట్లాడుతూ.. '' ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఫిబ్రవరి 12న సినిమాను విడుద‌ల చేయడానికి చేస్తున్నాం. కొత్త టెక్నీషియన్స్ అయినా ఈ సినిమాకు అందరు హార్డ్ వ‌ర్క్ చేశారు'' అని అన్నారు.

అనిల్ సుంక‌ర మాట్లాడుతూ.. ''అందరు కొత్త‌వాళ్ళ‌తో చేసిన చిత్ర‌మిది. ప్రేక్షకులకు విజువ‌ల్‌, ఎంట‌ర్ టైన్మెంట్ ఫీస్ట్ అవుతుంది'' అని అన్నారు.

ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి మాట్లాడుతూ.. ''సంవత్సరంన్నరగా ఈ సినిమా గురించి వర్క్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఎంతో స‌పోర్ట్ చేస్తూ వ‌చ్చారు. ఇది ప్రేమ కాదు గాధ.. ఇద్దరు హీరో, హీరోయిన్  మ‌ధ్య జ‌రిగే కొన్ని మూమెంట్స్, ఇన్సిడెంట్స్ తో జరిగే కథే ఈ సినిమా. నాని త‌న న‌ట‌న‌తో సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్ళాడు. విశాల్ మూడు సంవత్సరాలుగా నాకు తెలుసు. ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. యువ‌రాజ్ ప్ర‌తి ఫ్రేమ్ లో చాలా డిఫ‌రెంట్‌గా చూపించారు. ప్రతి టెక్నిషియ‌న్ తన సినిమాగా భావించి ఈ సినిమా చేశారు. నిర్మాతలు నాకు ఎంతో ఫ్రీడం ఇచ్చారు. ఫుల్ లెంగ్థ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఫిబ్రవరి 12న సినిమా విడుద‌ల‌వుతుంది. అందరికి నచ్చే సినిమా అవుతుంది'' అని అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో విశాల్ చంద్ర‌శేఖ‌ర్‌, యువ‌రాజ్‌, కృష్ణ‌కాంత్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఎడిటింగ్: గౌతం రాజు, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: హను రాఘవపుడి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ