'అతనొక్కడే' చిత్రం నుండి 'పటాస్' వరకు డిఫరెంట్ మూవీస్ లో నటించి విజయాలను సాధించిన నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా 'బద్రి' నుండి 'లోఫర్' వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించి బాక్సాఫీస్ ను షేక్ చేసిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.8గా నందమూరి కళ్యాణ్ రామ్ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'టెంపర్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పూరిజగన్నాథ్ డైరెక్టర్ గా, 'పటాస్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూరి జగన్నాథ్ కళ్యాణ్ రామ్ కోసం సూపర్ సబ్జెక్ట్ ను రెడీ చేశారు. ప్రెస్టిజియస్ మూవీగా రూపొందనున్న ఈ చిత్రం ఏప్రిల్ నెల నుండి రెగ్యులర్ చిత్రీకరణను జరుపుకోనుంది. నందమూరి కళ్యాణ్ రామ్ ప్రెస్టిజియస్ నిర్మిస్తున్న ఈ చిత్రానినకి కథ, స్ర్కీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం పూరిజగన్నాథ్. త్వరలోనే మిగతా నటీనటులు, టెక్నిషియన్ వివరాలను తెలియజేస్తారు. పటాస్ తో హీరోగా, నిర్మాతగా మంచి రేంజ్ పెంచుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ రేంజ్ ఈ చిత్రంతో మరింత పెరుగుతుందని నందమూరి అభిమానులు హ్యపీగా ఫీలవుతున్నారు.