Advertisementt

'లజ్జ' మూవీ ఆడియో లాంచ్!

Tue 02nd Feb 2016 02:01 PM
lajja movie audio launch,narasimha nandi,madhumitha  'లజ్జ' మూవీ ఆడియో లాంచ్!
'లజ్జ' మూవీ ఆడియో లాంచ్!
Advertisement
Ads by CJ

మధుమిత, శివ, వరుణ్ ప్రధాన పాత్రల్లో నరసింహ నంది దర్శకత్వంలో శ్రీ లక్ష్మి నరసింహ సినిమా పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'లజ్జ'. బూచేపల్లి తిరుపతి రెడ్డి నిర్మాత. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిగ్ సీడీను ఆవిష్కరించారు. తమ్మారెడ్డి భరద్వాజ ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా..

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ... ''ఫిలిం ఇండస్ట్రీతో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఎప్పటినుండో ఒక సినిమా చేయాలని కోరిక ఉంది. ఖచ్చితంగా సినిమా చేస్తాను. అది కూడా తొమ్మిది భాషల్లో తెరకెక్కిస్తాను. ఇక ఈ సినిమా విషయానికొస్తే సాంగ్స్, ట్రైలర్ చాలా బావున్నాయి. ఓ కొత్త కాన్సెప్ట్ తో సినిమా చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించి దర్శక నిర్మాతలకు మంచి పేరు తీసుకురావాలి'' అని చెప్పారు.

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ''నరసింహ నంది తన మొదటి సినిమాతోనే దర్శకులందరినీ తలెత్తుకునేలా చేశాడు. నేషనల్ అవార్డు దక్కించుకున్నాడు. ఆ తరువాత కూడా సినిమాలు చేశాడు కాని ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. అందరికి నచ్చే విధంగా సినిమా చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ సినిమా తనకు కమర్షియల్ గా వర్కవుట్ అయ్యే విధంగా కనిపిస్తుంది. ఈ సినిమాతో తను వరుసగా మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

నరసింహ నంది మాట్లాడుతూ.. ''ఈ చిత్రాన్ని రొమాంటిక్ మూవీగా చిత్రీకరించాను. ప్రతి అమ్మాయి పెళ్ళైన తరువాత తన భర్త ప్రేమ తనకే సొంతం కావాలని కలలు కంటుంటుంది. భర్తను దగ్గర్నుంచి ప్రేమను పొందలేకపోయిన తన మనసుకు దగ్గరగా లేకపోయినా, తన ఆలోచనలు అర్ధం చేసుకోలేకపోయినా అలాంటి సందర్భాల్లో అమ్మాయి ఆలోచనలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది, అనేది ఈ చిత్ర కథ. తన మనసుకు నచ్చిన వ్యక్తి కోసం ఎంత దూరమైనా వెళ్ళగలిగే పాత్రలో నటి మధుమిత చాలా అధ్బుతంగా నటించింది. మంచి సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా చేశాం. ప్రొడ్యూసర్ సపోర్ట్ మర్చిపోలేనిది. హీరోయిన్ బోల్డ్ క్యారెక్టర్ లో అధ్బుతంగా నటించింది. ఇప్పటివరకు ఆర్ట్ తరహా చిత్రాలనే తెరకెక్కించాను. మొదటిసారి ఆర్ట్ సినిమాకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి సినిమా తీశాను. ఇకనుండి ఈ బ్యానర్ లో సంవత్సరానికి ఒక సినిమా చొప్పున తీయాలనుకుంటున్నాను. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

బూచేపల్లి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. ''నరసింహ అధ్బుతమైన కథ చెప్పాడు. ఈ సినిమాను ఎలా అయినా ప్రొడ్యూస్ చేయాలని తనను నమ్మి సినిమా మీద పెట్టుబడి పెట్టాను. ఇంకా తను మంచి మంచి చిత్రాలను రూపొందించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో మధుమిత, శివ, వరుణ్, సాగర్, వనమాలీ, ఆర్.పి.పట్నాయక్, సుక్కు, శివ, మహంతి, పి.ఎల్.కె.రెడ్డి, రఫీ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి సహనిర్మాతలు: పి.ఎల్.కె.రెడ్డి, పాశం వెంకటేశ్వరులు, కె.రవిబాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: బుజ్జి, ఎ.శ్రీనివాస్, కృష్ణ, బ్రహ్మవలి, కెమెరా: ఎస్.మురళీమోహన్ రెడ్డి, ఎడిటర్: వి.నాగిరెడ్డి, సంగీతం: సుక్కు, పాటలు: వనమాలీ, నిర్మాత: బూచేపల్లి తిరుపతి రెడ్డి, రచన-దర్శకత్వం: నరసింహ నంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ