Advertisementt

అడల్ట్ కామెడీగా 'బేబీడాల్' మూవీ!

Mon 01st Feb 2016 02:08 PM
baby doll movie,hashika datt,manas,munna kashi,raju  అడల్ట్ కామెడీగా 'బేబీడాల్' మూవీ!
అడల్ట్ కామెడీగా 'బేబీడాల్' మూవీ!
Advertisement
Ads by CJ

మానస్ హీరోగా రైజింగ్ సన్ ఫిలింస్ పతాకంపై హాషిక దత్ హీరోయిన్ గా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న తెలుగు, తమిళ చిత్రం 'బేబీడాల్'. ఈ చిత్రాన్ని రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా మొదటి పాటను సోమవారం హైదరాబాద్ లోని సానాయాదిరెడ్డి స్టూడియోలో రికార్డ్  చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో..

హీరోయిన్,దర్శకురాలు హాషిక దత్ మాట్లాడుతూ.. ''ప్రతి అబ్బాయికీ ఒక డ్రీమ్ వుంటుంది. తను ప్రేమించే ఎలా వుండాలి అనేది అతను ఇమాజిన్ చేసుకుంటాడు. దానికి మేం తెలుగులో 'బేబీడాల్' అని పేరు పెట్టాం. ఈ చిత్రాన్ని తమిళ్ వెర్షన్ లో తమిళ ఆర్టిస్టులతో చేస్తున్నాం. ఈ రెండు లాంగ్వేజెస్ లో ఏకకాలంలో షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాని ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నాం. ప్రత్యేకంగా యూత్ కి నచ్చే సీన్స్, డైలాగ్స్ ఈ చిత్రంలో వుంటాయి. ఇదొక అడల్ట్ కామెడీ చిత్రం. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ 30 రోజులు నెల్లూరులో చేస్తున్నాం. ఒక పది రోజుల షెడ్యూల్ మాత్రం హైదరాబాద్ లో చేస్తున్నాం. మేము రిలీజ్ చేసిన సినిమా ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు సినిమాకు సంబంధించిన మొదటిపాటను రికార్డ్ చేయబోతున్నాం. మున్నా కాశీ మంచి మ్యూజిక్ అందించారు'' అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ మున్నా కాశీ మాట్లాడుతూ.. '' ఈ చిత్రంలో ఐదు పాటలు వుంటాయి. ఒక్కో పాట ఒక్కో జోనర్ లో వుంటూ చాలా డిఫరెంట్ గా అనిపిస్తాయి. 'కళ్ళే చూసిన అందం' అనే మొదటిపాటను శ్రీరాం చంద్రతో పాడిస్తున్నాం. దానికి చైతన్యవర్మ, కేదారినాథ్ లిరిక్స్ అందించారు'' అని చెప్పారు.

నిర్మాత రాజు మాట్లాడుతూ.. ''ఇప్పటికి రెండు, మూడు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాను. కాని అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేకపోయాను. హాషిక దత్ ఈ సినిమా స్టొరీ చెప్పగానే బాగా నచ్చింది. ఈ సినిమాతో నిర్మాతగా నిలదొక్కుకుంటానని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

మానస్, హాషిక, నరేష్, బ్రహ్మానందం, రావు రమేష్, సంపూర్ణేష్ బాబు, తాగుబోతు రమేష్, సప్తగిరి, సితార, పూర్ణిమ, భాగ్యరాజ్, సముద్రఖని, సతీష్, ఇమ్రాన్ అనాచి, మొట్టయ్ రాజేంద్రన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మున్నా కాశి, సినిమాటోగ్రఫీ: రాఘవ నూలేటి, మాటలు: రవిశంకర్ పర్రి, ఎడిటింగ్: అనిల్ కుమార్ జల్లు, విజువల్ ఎఫెక్ట్స్: కార్టూనిస్ట్ నవీన్, స్టిల్స్: శ్రీ, మేకప్: పవన్, కాస్ట్యూమ్స్: రాజు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: ఎ.ఏడుకొండలు, వై.సురేష్ బాబు, కోడైరెక్టర్స్: రాజరాజన్ ఆర్క్, జగదీష్ పల్లి, నిర్మాత:రాజు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హాషిక దత్.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ