Advertisementt

'గరం' రిలీజ్ డేట్ ఖరారు!

Fri 29th Jan 2016 04:04 PM
garam movie release date,aadi,sai kumar,naresh,adah sharma  'గరం' రిలీజ్ డేట్ ఖరారు!
'గరం' రిలీజ్ డేట్ ఖరారు!
Advertisement
Ads by CJ

ఆది, ఆదాశర్మ జంటగా శ్రీమతి వసంత శ్రీనివాస్ సమర్పణలో శ్రీనివాసాయి స్క్రీన్స్ పతాకంపై మదన్ దర్శకత్వంలో పి.సురేఖ నిర్మిస్తున్న చిత్రం 'గరం'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో..

సాయి కుమార్ మాట్లాడుతూ.. ''మదన్ ఈ చిత్రాన్ని చాలా బాగా డైరెక్ట్ చేశాడు. 2016 సంవత్సరం పాజిటివ్ బజ్ తో  మొదలయ్యింది. ప్రతి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటాను. అలానే ఫిబ్రవరి 12న విడుదలవుతున్న మా సినిమా కూడా పెద్ద హిట్ కావాలని ఆశిస్తున్నాను. ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. ఫీల్ గుడ్ ఫిలిం. అమెరికా, కెనడా లలో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నాం. శ్రీనివాస్ మంచి కథ ఇచ్చాడు. సెన్సార్ సభ్యుల నుండి మంచి స్పందన లభించింది. ఆదా ఈ సినిమాలో చాలా చక్కగా నటించింది'' అని చెప్పారు.

నరేష్ మాట్లాడుతూ.. ''ఈ సంవత్సరం మంచి హిట్స్ తో స్టార్ట్ అయింది. ఖచ్చితంగా ఈ సినిమా కూడా హిట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే స్టొరీ. మదన్ మరో 10 మెట్లు ఎదిగేల చేసే చిత్రమిది. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో తెరకెక్కించారు. ఆది, ఆదా చాలా చక్కగా నటించారు. క్లైమాక్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది'' అని చెప్పారు.

ఆది మాట్లాడుతూ.. ''ట్రైలర్ కు, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫిబ్రవరి 12న రిలీజ్ అవుతుంది. అందరు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

ఈ చిత్రానికి కథ,మాటలు-శ్రీనివాస్ గవిరెడ్డి, పాటలు: భాస్కర్ భట్ల, చైతన్య ప్రసాద్, శ్రీమణి, పులగం చిన్నారాయణ, కోరియోగ్రఫీ: శేఖర్, జాని, విద్యాసాగర్, ఫైట్స్: థ్రిల్లర్ మంజు, వెంకట్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: టి.సురేందర్ రెడ్డి, సంగీతం: అగస్త్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబ్జి, నిర్మాత: పి.సురేఖ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మదన్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ