రమేష్ బాబు, శ్రీకాంత్, అంజలి, గెహనా వసిశ్ట్ హీరో హీరోయిన్లుగా ఇందుజ క్రియేషన్స్ పతాకంపై వనజ, రేణుక సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'బి.టెక్ లవ్ స్టొరీ'. ఎల్లారెడ్డి దర్శకుడు. ఈ చిత్రం పాటల విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. సానాయాదిరెడ్డి, కృష్ణుడు బిగ్ సీడీను, డి.ఎస్.రావు ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా..
సానాయాదిరెడ్డి మాట్లాడుతూ.. ''ఇండస్ట్రీకు చాలా మంది కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలు వస్తున్నారు. మంచి కథలతో సినిమాలు తీసి సక్సెస్ సాదిస్తున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమా తీసిన ఈ చిత్ర దర్శకుడికి నిర్మాతలకు నా అభినందనలు. ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
కృష్ణుడు మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో సిబిఐ ఆఫీసర్ పాత్రలో నటించాను. ఇద్దరు హీరోలు ఎంతో ప్యాషనేట్ గా వర్క్ చేశారు. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నిర్మాతలకు మంచి లాభాలు రావాలి'' అని చెప్పారు.
దర్శకుడు ఎల్లారెడ్డి మాట్లాడుతూ.. ''ఒక మంచి ఫీల్ ఉన్న లవ్ స్టొరీ. ప్రతి యువకునికి కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలని ఈ టైటిల్ పెట్టాం. సొసైటీలో ఉన్న యువతకు మంచి మెసేజ్ తో పాటు అన్ని వర్గాల వారికి నచ్చే అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించాను. చిన్ని చరణ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ప్రతి పాట కథ పరంగా ఉంటాయి. జి.ఎల్.బాబు అధ్బుతమైన ఫోటోగ్రఫీ అందించారు. హాస్యానికి ఈ చిత్రంలో పెద్ద పీట వేశాం'' అని చెప్పారు.
నిర్మాత వనజ మాట్లాడుతూ.. ''వైజాగ్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్ర షూటింగ్ నిర్వహించాం. మంచి సాహిత్యంతో కూడిన సంగీతాన్ని అందించారు. ఫోటోగ్రఫీ బావుంటుంది. రమేష్, శ్రీకాంత్ ఈ సినిమాతో హీరోలుగా పరిచయమవుతున్నారు. కొత్త వాళ్ళయినా తమ పాత్రలకు న్యాయం చేశారు. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుంది'' అని చెప్పారు.
ఈ చిత్రానికి ఎడిటింగ్: మేనగ శ్రీను, కొరియోగ్రాఫర్: బాలకృష్ణ, ప్రేమ్ గోపి, కపిల్, స్టంట్స్: బాచి, అవినాష్, సినిమాటోగ్రఫీ: జి.ఎల్.బాబు, మ్యూజిక్ డైరెక్టర్: చిన్ని చరణ్, కో ప్రొడ్యూసర్స్: బద్రినాథ్, రవి, ప్రొడ్యూసర్: అక్కినపల్లి వనజ, రేణుక, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: ఎల్లారెడ్డి.