రాజ్ తరుణ్, అర్థన జంటగా శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి పూర్ణిమ ఎస్ బాబు సమర్పణలో ఎస్.శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి నిర్మిస్తోన్న చిత్రం 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు'. శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకుడు. ఈ చిత్రం ప్లాటినం డిస్క్ ఫంక్షన్ బుధవారం హైదరాబాద్ లోని ఘటకేసర్ శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగింది. హీరో ఆది, నిఖిల్ చిత్ర బృందానికి ప్లాటినం డిస్క్ లను అందజేశారు. ఈ సందర్భంగా..
నిఖిల్ మాట్లాడుతూ.. ''రాజ్ తరుణ్ కి ఈ సినిమాతో మరో పెద్ద సక్సెస్ వచ్చి వరుసగా సినిమాలు చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.
ఆది మాట్లాడుతూ.. ''శ్రీనివాస్ నా 'గరం' సినిమాకు డైలాగ్స్ అందించాడు. ఎమోషన్స్ మీద మంచి పట్టు ఉన్న వ్యక్తి. ఈ సినిమాతో దర్శకునిగా పరిచయమవుతున్నాడు. తనకు ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి'' అని చెప్పారు.
శ్రీనివాస్ గవిరెడ్డి మాట్లాడుతూ.. ''ప్రెజంట్ ట్రెండ్ కు తగ్గట్లు ఉండే రాముడు అందమైన సీత కోసం ఏం చేసాడనేడే సినిమా కథ. గోపిసుందర్ ఇచ్చిన మ్యూజిక్ సూపర్ హిట్ అయింది. స్నేహానికి మంచి వేల్యూ ఉండేలా సినిమా ఉంటుంది. రామాయణంలో రాముడికి ఫ్రెండ్స్ లేరు అందుకే రావణాసురుడు వచ్చి సీతమ్మను ఎత్తుకెళ్ళారు కాని ఈ రాముడుకి ఫ్రెండ్స్ ఉన్నారు అనే డైలాగ్ అందరికి నచ్చుతుంది. చిన్నప్పటి స్వీట్ లవ్ స్టొరీ ఈ సినిమా. కుటుంబంతో సహా చూడదగ్గ చిత్రం'' అని చెప్పారు.
శైలేంద్ర బాబు మాట్లాడుతూ.. ''సినిమా బాగా వచ్చింది. యంగ్ స్టర్స్ కు బాగా కనెక్ట్ అవుతుంది. అందరూ ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.
రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ''ఆడియోను పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ కు థాంక్స్. గోపిసుందర్ గారికి నేను పెద్ద అభిమానిని. ఆయన నా సినిమాకు మ్యూజిక్ చేయడం సంతోషంగా ఉంది. జనవరి 29 న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.
ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, పాటలు: సుద్ధాల అశోక్ తేజ, రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, వనమాలి, కృష్ణచైతన్య, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, కెమెరా: విశ్వ, ఆర్ట్: జేవీ, అడిషనల్ డైలాగ్స్: అనీల్ మల్లెల, ప్రొడక్షన్ కంట్రోలర్: కొర్రపాటి వెంకటరమణ, సమర్పణ; శ్రీమతి పూర్ణిమ ఎస్ బాబు, కథ,స్కీన్ ప్లే,దర్శకత్వం: శ్రీనివాస్ గవిరెడ్డి.