Advertisementt

'ఇప్పట్లో రాముడిలా సీతలా.. ''పాటలు విడుదల!

Thu 28th Jan 2016 12:58 PM
ippatlo ramudila seethala evaruntarandi babu,venkatesh,prashnath,mahidhar  'ఇప్పట్లో రాముడిలా సీతలా.. ''పాటలు విడుదల!
'ఇప్పట్లో రాముడిలా సీతలా.. ''పాటలు విడుదల!
Advertisement
Ads by CJ

ప్రశాంత్, మహిధర్, ఇషిత, లలిత హీరో హీరోయిన్లుగా బేబీ అముక్త సమర్పణలో కె.వెంకటేష్ దర్శకత్వంలో లక్ష్మీప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రశ్నాథ్ నిర్మిస్తోన్న చిత్రం 'ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. నర్సాపూర్ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు బిగ్ సీడీను, ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా..

బండారు మాధవనాయుడు మాట్లాడుతూ.. ''ఈ చిత్ర దర్శకుడు వెంకటేష్, మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ మా నియోజక వర్గానికి చెందిన వ్యక్తులే. వారిద్దరూ మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా సూపర్ హిట్ కావాలి'' అని చెప్పారు.

సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ''సినిమాకు సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్ చూశాను. మంచి సినిమా తీయాలనే ప్రయత్నం చేశారు. భవిష్యత్తులో ప్రేక్షకులను ఉత్తేజపరిచే చిత్రాలను రూపొందించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

శివ నాగేశ్వరావు  మాట్లాడుతూ.. ''వెంకటేష్ నా దగ్గర పని చేశాడు. కొత్తగా ఆలోచించే వ్యక్తి. ఖచ్చితంగా మంచి సినిమా తీసి ఉంటాడు. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ మాట్లాడుతూ.. ''నాకు ఈ అవకాసం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్'' అని చెప్పారు.

నిర్మాత ప్రశ్నాథ్ మాట్లాడుతూ.. ''డైరెక్టర్ వెంకటేష్ నాకు పది సంవత్సరాలుగా తెలుసు. ఈ సినిమా కథ వినగానే నిర్మించాలనుకున్నాను. టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు ఎంతగానో సపోర్ట్ చేశారు. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

దర్శకుడు వెంకటేష్ మాట్లాడుతూ.. ''ఇదొక రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ సినిమా. ఓ మర్డర్ మిస్టరీ ఉంటుంది. సినిమా బాగా వచ్చింది'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో గాంధీ, వీరరాజు, రామ్ జగన్, సత్యరెడ్డి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, చల్లారావు, మహిధర్, ఇషిత తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి ఎడిటింగ్: సత్య గిడుతూరి, పాటలు: చైతన్య రేపాటి, సంగీతం: రమేష్ డి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: జోశ్య భట్ల, డాన్సు: జోజో, ఫోటోగ్రఫీ: ఎ.జగన్, నిర్మాత: ప్రశ్నాథ్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వెంకటేష్ కె. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ