Advertisementt

లక్కీ మీడియా సంస్థకు పదేళ్ళు-బెక్కం వేణుగోపాల్‌

Mon 25th Jan 2016 11:56 AM
bekkam venugopal,lucky media production house,10 years celebrations  లక్కీ మీడియా సంస్థకు పదేళ్ళు-బెక్కం వేణుగోపాల్‌
లక్కీ మీడియా సంస్థకు పదేళ్ళు-బెక్కం వేణుగోపాల్‌
Advertisement
Ads by CJ

ల‌క్కీ మీడియా సంస్థ అధినేత బెక్కం వేణుగోపాల్‌ ఆ సంస్థను స్థాపించి జనవరి 25కి పది సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది. ఈ సంద‌ర్భంగా బెక్కం వేణుగోపాల్ ఆదివారం విలేకర్లతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ.. ''నేను, శివాజీ మంచి స్నేహితులం. మీడియాలో పని చేసినప్పటినుండి ఇద్దరం ఒక మంచి స్టెప్ వేయాలనుకున్నాం. శివాజీ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేయాలనేవాడు. మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ తీయాల‌ని అప్పుడే అనుకున్నాం. ల‌క్కీ మీడియా అనే పేరుతో బ్యానర్ స్టార్ట్ చేశాం. ''టాటా బిర్లా మ‌ధ్య‌లో లైలా'' ,''స‌త్య‌భామ',''మా ఆయ‌న చంటిపిల్లాడు'' వంటి చిత్రాలను తెరకెక్కించాం. 2009లో 'త‌కిట త‌కిట' సినిమా మీదే ఫుల్ కాన్సన్ట్రేట్ చేసి తీశాను. ఆ త‌ర్వాత  'ప్రేమ ఇష్క్ కాద‌ల్‌', 'మేం వ‌య‌సుకు వ‌చ్చాం' చిత్రాలను తెరకెక్కించాను. చిన్న బ‌డ్జెట్‌లో సినిమా చేయ‌వ‌చ్చ‌ని నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చిన సినిమా 'ప్రేమ ఇష్క్ కాద‌ల్‌'. 

రీసెంట్ గా 'సినిమా చూపిస్త మావ' చేశాం. ఈ ఏడాది రెండు సినిమాలను చేయలాని భావిస్తున్నాం. అవి కాకుండా మరో  సినిమాను కూడా సెట్స్ మీద‌కు తీసుకువెళ్ళనున్నాం. ఏప్రిల్ నుంచి మా సంస్థ‌లో సినిమా మొద‌ల‌వుతుంది. ఒక‌టి కొత్త ద‌ర్శ‌కుడితో, మ‌రొక‌టి త్రినాథ‌రావు న‌క్కిన‌తో చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. 'బొమ్మ‌రిల్లు', 'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు' లాంటి సినిమాలు చేయాల‌నుంది. అలాంటి క‌థ‌ల‌ను సిద్ధం చేయిస్తున్నాను. సినిమా మొదలుపెట్టే ముందు డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడి ప్రేక్షకులకు ఎలాంటి సినిమా నచ్చుతుందో తెలుసుకొని దానికి త‌గ్గ‌ట్టు క‌థ‌లో మార్పులు చేర్పులు కూడా చేసుకుంటాను. రీషూట్స్ చేయడానికి కూడా వెనుకాడను. బిజినెస్‌ని న‌మ్మి నేనెప్పుడూ సినిమాలు చేయ‌లేదు. ప్రేక్ష‌కుడికి రీచ్ కావాల‌నే ఉద్దేశంతో  సినిమా తీస్తాను. కొన్ని సినిమాల‌కు బాగా డ‌బ్బులు వ‌చ్చాయి కొన్నింటికి రాలేదు. నాకు ఈ పది సంవత్సరాల జ‌ర్నీ ఎంతో అనుభవం నేర్పించింది. నేనెప్పుడూ అనుభ‌వ‌మే ఆస్తి అని అనుకుంటాను. ల‌క్కీ మీడియా సంస్థ నుండి మంచి సినిమాలు వస్తాయనే ఆలోచన ప్రేక్షకుల్లో కలిగినందుకు సంతోషంగా ఉంది'' అని చెప్పారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ