ఈమధ్య కాలంలో హీరోల ఆడియో ఫంక్షన్స్‌కి మిగతా హీరోలు కూడా రావడం, ఆడియోను రిలీజ్ చెయ్యడం మనం చూస్తున్నాం. ఈ విషయంలో టాలీవుడ్ హీరోలంతా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. ఆయా హీరోల సినిమాల ఆడియోలు, సినిమాలు పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. అయితే ఈ విషయంలో ఎన్టీఆర్ మరి కాస్త ముందుకెళ్ళి పక్క రాష్ట్రంలోని హీరోకి సపోర్ట్ చెయ్యబోతున్నాడు. కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హీరోగా వస్తున్న కొత్త చిత్రం చక్రవ్యూహ ఆడియో ఫంక్షన్‌కి ఎన్టీఆర్ ఛీఫ్ గెస్ట్‌గా అటెండ్ అవ్వబోతున్నాడు.
ఫిబ్రవరి 12న ఈ చిత్రం ఆడియో బెంగుళూరులో ఘనంగా జరగబోతోంది. ఈ చిత్రంలోని ఒక స్పెషల్ సాంగ్‌ని ఎన్టీఆర్, కాజల కలిసి పాడిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి ఈ పాట పెద్ద హైలైట్ అవుతుందని చక్రవ్యూహ యూనిట్ చెబుతోంది. బాద్‌షా చిత్రం కోసం తెలుగులో శింబుతో పాట పాడించిన థమన్ ఇప్పుడు చక్రవ్యూహ కోసం ఎన్టీఆర్‌తో పాట పాడించాడు.