Advertisementt

'పడేసావే' మూవీ టీజర్ లాంచ్!

Fri 22nd Jan 2016 09:18 PM
padesave movie teaser launch,chunia,nagarjuna,karthik raju  'పడేసావే' మూవీ టీజర్ లాంచ్!
'పడేసావే' మూవీ టీజర్ లాంచ్!
Advertisement
Ads by CJ

కార్తిక్ రాజు, నిత్య శెట్టి, సామ్ ప్రధాన పాత్రల్లో అయాన్ క్రియేషన్స్ బ్యానర్ పై చునియా దర్శకత్వం వహిస్తూ.. నిర్మిస్తోన్న చిత్రం 'పడేసావే'. ఈ చిత్రం టీజర్ లాంచ్ శుక్రవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ సందర్భంగా..

దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ''నేను రాజమౌళితో కలిసి సీరియల్ మొదలుపెట్టినపుడు మాతోపాటే చునియా కలిసి పని చేసింది. ఆ తరువాత నాగార్జున దగ్గర వర్క్ చేసింది. తను మా ముగ్గురి దగ్గర వర్క్ చేసి ఆడియన్స్ ని ఎలా పడేయాలో నేర్చుకుంది. అందుకే సినిమాకు కూడా అదే టైటిల్ పెట్టింది. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.

నాగార్జున మాట్లాడుతూ.. ''దేనికైనా ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి. చునియా రాఘవేంద్రరావు, రాజమౌళి ల వద్ద పని చేసింది. మంచి దర్శకులతోనే కాదు బ్యాడ్ డైరెక్టర్స్ తో కూడా తను పని చేసింది. ఎదుటివారితో తను ఎంత ఇంటెలిజెంట్ గా మాట్లాడేదే నేను గమనించేవాడిని. అన్నపూర్ణ స్టూడియోస్ లో కూడా తను చాలా నేర్చుకుంది. తను డైరెక్ట్ చేసిన ఈ సినిమా చూసి నేనే ప్రమోట్ చేయాలనుకున్నాను. అంతలా నన్ను సినిమా ఆకట్టుకుంది. అందుకే ఈ టీంతో అసోసియేట్ అయ్యాం. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కథతో రిలేట్ అవుతారు. హిలారియాస్ ఎంటర్టైన్మెంట్ గా ఈ చిత్రాన్ని రూపొందించింది. ప్రతి ఒక్కరు హానెస్ట్ గా సినిమాకు పని చేశారు'' అని చెప్పారు.

చునియా మాట్లాడుతూ.. ''నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం రాఘవేంద్రరావు గారే. ఆయనను ఎప్పుడు పేరు పెట్టి మాట్లాడింది లేదు. నాకు డైరెక్టర్ అంటే రాఘవేంద్రరావు గారే. యువ సీరియల్ తో నాకు నాగార్జున గారు ప్లాట్ ఫాం కలిపించారు. 'మనం' సినిమాకు పని చేస్తున్న సమయంలో కార్తీక్ కోసం స్క్రిప్ట్ రాసుకున్నానని ఒకసారి వినమని నాగార్జున గారిని అడిగాను. ఆయన విని బావుంది.. సినిమా చేసిన తరువాత చూపించమని చెప్పాను. సినిమా కంప్లీట్ అయిన తరువాత చూసి.. మా టీంతో అసోసియేట్ అయ్యారు. ఇదొక యూత్ ఫుల్ ఫిలిం. యంగ్ మైండ్స్ ఎంత కన్ఫ్యూజన్ లో ఉంటాయి..? స్నేహం, ప్రేమ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి. ఈ సినిమాకు స్ట్రాంగ్ మ్యూజిక్ కావాలి. అనూప్ కి స్టొరీ చెప్పగానే చేస్తా అన్నాడు. 'మనం' , 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలకు ఎంత ఎఫర్ట్ పెట్టి చేసాడో ఈ సినిమాకు కూడా అంతే ఎఫర్ట్ పెట్టాడు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్. ఈ నెల 26 న ఆడియో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు.

అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాకు వర్క్ చేయడానికి కారణం చునియా గారే. మనం సినిమా కోసం ఆమెతో కలిసి వర్క్ చేశాను. చాలా బాగా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. సినిమా అంతా కలర్ ఫుల్ గా ఉంటుంది'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో కార్తిక్ రాజు, నిత్య శెట్టి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి మ్యూజిక్: అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ: కన్నా కునపరెడ్డి, ఎడిటింగ్: ధర్మేంద్ర.కె, డైలాగ్స్: కిరణ్ కుమార్, లిరిక్స్: అనంత్ శ్రీరాం, స్టంట్స్: వెంకట్, కోరియోగ్రఫీ: రాజు సుందరం, విజయ్, చంద్రకిరణ్, డైరెక్టర్: చునియా.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ