సిద్ధార్థ్, త్రిష, హన్సిక, పూనమ్ బాజ్వా, సుందర్.సి ప్రధాన పాత్రల్లో తమిళంలో రూపొందించిన 'అరన్మణి 2' చిత్రాన్ని సర్వాంత రామ్ క్రియేషన్స్, గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ పై జవ్వాజి రామాంజనేయులు సమర్పకుడుగా 'కళావతి' పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. సుందర్.సి దర్శకుడు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి 29న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా
చిత్ర సమర్పకుడు జవ్వాజి రామాంజనేయులు మాట్లాడుతూ.. ''2012 లో తమిళంలో డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్ మొదలుపెట్టాం. సుమారుగా నలభై సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశాం. తెలుగులో సర్వాంత రామ్ క్రియేషన్స్ బ్యానర్ స్టార్ట్ చేశాం. తెలుగులో ఇది మా బ్యానర్ లో వస్తోన్న నాల్గవ సినిమా. గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ తో కలిసి మా చిత్రాన్నిఈ నెల 29 న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. తమిళంలో సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ అయ్యాయి. సెన్సార్ సభ్యులు సినిమా చూసి మెచ్చుకున్నారు. తెలుగులో కూడా సెన్సార్ కు సిద్ధమవుతోంది. అన్ని ఏరియాల్లో బిజినెస్ పూర్తయ్యింది. టేబుల్ ప్రాఫిట్ లో ఉన్నాం. సిద్ధార్థ్, హన్సిక, పూనమ్ బాజ్వా తెలుగు వాళ్లకు సుపరిచితులే. డబ్బింగ్ సినిమాలా కాకుండా ఓ తెలుగు స్ట్రెయిట్ ఫిలింలాగా రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా కోసం నాలుగు కోట్ల వ్యయంతో ఒక బంగ్లా సెట్ వేశాం. అది కాకుండా చెన్నైలో 130 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని స్థాపించాం. ఈరోజు అది హాలిడే స్పాట్ గా మారింది. హిప్ హాప్ మంచి సంగీతాన్ని అందించారు. ఇప్పటికే పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగులో 500 నుండి 600 థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమాలో ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుంది. 'కళావతి' టైటిల్ రోల్ లో సినిమాలో ఉన్న ముగ్గురు హీరోయిన్లు కాకుండా మరో అమ్మాయి నటిస్తుంది. అదెవరో సినిమా చూసి తెలుసుకోవాలి. సుందర్.సి గారు రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి పెద్ద పెద్ద హీరోలతో కలిసి పని చేశారు. ఆయనకు ఆడియన్స్ లో స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా నచ్చుతుంది. 'చంద్రకళ' కంటే రెండింతలు ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉంటుంది'' అని చెప్పారు.
సమర్పణ - శ్రీ జవ్వాజి రామాంజనేయులు, నటీనటులు - సుందర్ సి, సిద్ధార్థ, త్రిష, హన్సిక, పూనమ్ బాజ్వా, సూరి, కోవై సరళ, రాధా రవి, సంగీతం - హిప్ హాప్ తమిళ, దర్శకుడు - సుందర్ సి, నిర్మాత - గుడ్ ఫ్రెండ్స్.