Advertisement

అప్పుడే పెళ్లి ఆలోచన లేదు: విశాల్!

Wed 20th Jan 2016 08:35 PM
kathakali movie,releasing on january 22nd,vishal,pandiraj  అప్పుడే పెళ్లి ఆలోచన లేదు: విశాల్!
అప్పుడే పెళ్లి ఆలోచన లేదు: విశాల్!
Advertisement

విశాల్, కేథరిన్ జంటగా పాండిరాజ్ దర్శకత్వంలో విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్, పాండిరాజ్ నిర్మించిన చిత్రం 'కథకళి'. తమిళంలో సంక్రాంతి కానుకగా విడుదలయ్యి ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో అనువదించి అదే పేరుతో జనవరి 22న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్ లోని విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో..

విశాల్ మాట్లాడుతూ.. ''తమిళంలో సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలయిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. తెలుగులో కూడా అదే టైటిల్ తో జనవరి 22న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. కథకు కథకళి టైటిల్ యాప్ట్ అని సెలెక్ట్ చేసుకున్నాం. నేషనల్ అవార్డు విన్నర్ పాండిరాజ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. మొదటిసారి థ్రిల్లర్ జోనర్ లో సినిమా చేశాను. ఇప్పటివరకు నేను ఇలాంటి సినిమాలో నటించలేదు. సెకండ్ హాఫ్ లో పాటలు ఉండవు. డైరెక్టర్ గారి ఫ్రెండ్ కి జరిగిన రెండు సంఘటనలను ఆధారంగా చేసుకొని కథ రాశారు. ఇదొక మర్డర్ మిస్టరీ. చెన్నై లో మొదలయ్యి కడలూరులో ఎండ్ అయ్యే స్టొరీ. ఒక రోజులో జరిగే కథ. స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుంది. మర్డర్ ఎవరు చేసారనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఒక నవల చదువుతున్న భావన కలుగుతుంది.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు మంచి పేరొస్తుంది. రెండు గంటల మూడు నిమిషాల నిడివి గల ఈ సినిమా ప్రేక్షకులకు థ్రిల్ ఫీల్ చేస్తుంది. 'వాడువీడు','ఇంద్రుడు' లాంటి డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉన్న సినిమాల్లో నటించాను. వాటితో నాకు మంచి పేరొచ్చింది. ఈ సినిమాతో కూడా మంచి పేరొస్తుందనే నమ్మకంతో ఉన్నాను. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఈ సినిమా. నిజానికి తెలుగు, తమిళంలో ఒకేరోజు ఈ సినిమా రిలీజ్ చేయాల్సింది కాని తమిళంలో దొరికినన్ని థియేటర్లు తెలుగులో దొరకలేదు. స్ట్రెయిట్ సినిమాలు చాలా రిలీజ్ అయ్యాయి. సో.. మంచి డేట్ కోసం ఎదురు చూసి 22న రిలీజ్ చేయాలనుకున్నాం. పాండిరాజ్ గారు నాకు రెండు కథలు చెప్పారు. ఈ సినిమా కథ విన్నప్పుడు గెస్సింగ్ గేమ్ లాగా అనిపించింది. ఫుల్ లెంగ్థ్ థ్రిల్లర్ జోనర్ సినిమా పాండిరాజ్ కు కొత్త అయినా చేయగలడనే నమ్మకంతో ప్రాజెక్ట్ మొదలుపెట్టాం. ఇక ఈ సినిమా తరువాత తమిళంలో 'మరుద' అనే సినిమాలో నటిస్తున్నాను. ముత్తయ్య దర్శకుడు. అవుట్ అండ్ అవుట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉండే సినిమా అది. ఇక నడిగర్ సంఘం విషయానికొస్తే తెలుగబ్బాయి తను ఇక్కడ ఏం చేయగలడని చాలా మంది అన్నారు. కాని మంచి పని చేయడానికి భాషతో పని లేదు. 10 సంవత్సరాల తరువాత ఎన్నికలు సవ్యంగా జరిగాయి. 30 సంవత్సరాల తరువాత ఇప్పుడిప్పుడే నడిగర్ సంఘంలో మార్పులు వస్తున్నాయి. మేము చెప్పిన విషయాలను ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తున్నాం. నడిగర్ సంఘానికి సంబంధించిన ఎకౌంటు డీటెయిల్స్ మాకు పూర్తి స్థాయిలో అందలేదు. శరత్ కుమార్ గారిపై లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నాను. పెర్సనల్ లైఫ్ కొంచెం మిస్ అవుతున్నాను. షూటింగ్, నడిగర్ సంఘంలో పనులతో చాలా బిజీగా ఉంటున్నాను. అప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. ఇంకా నా మైండ్ పెళ్లికి సిద్ధంగా లేదు. వరలక్ష్మి నా చిన్ననాటి స్నేహితురాలు. తనతో వస్తున్న గాసిప్స్ విషయంలో వాస్తవం లేదు'' అని చెప్పారు.

పాండిరాజ్ మాట్లాడుతూ.. ''తమిళంలో నేను డైరెక్ట్ చేసిన 'పసంగ2', 'కథకళి' చిత్రాలు ఒకదాని తరువాత ఒకటి రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ ను సాధించాయి. అలానే తెలుగులో కూడా కథకళి, మేము చిత్రాలు వరుసగా రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా మంచి సక్సెస్ ను సాదిస్తాయనే నమ్మకం ఉంది. నా డైరెక్షన్ లో మొదటిసారిగా వస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది'' అని చెప్పారు.

హిప్ హాప్ తమిళ మాట్లాడుతూ.. ''ఈ సినిమాకు మ్యూజిక్ చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో రెండు పాటలు, రెండు థీమ్ ట్రాక్స్ ఉంటాయి. విశాల్ తో ఇది నా రెండో సినిమా. త్వరలోనే రామ్ చరణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వస్తోన్న చిత్రానికి మ్యూజిక్ చేయనున్నాను. దాంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే అవకాశాలున్నాయి'' అని చెప్పారు.

కేథరిన్ తెరీసా మాట్లాడుతూ.. ''తమిళంలో మద్రాసు తరువాత ఈ సినిమాలో నటించాను. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. తమిళంలో మంచి విజయాన్ని సాధించిన ఈ సినిమా తెలుగులో కూడా పెద్ద సక్సెస్ కావాలి'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో మధుసూదనరావు, శత్రు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement