రంజిత్, అర్చన జంటగా మాంత్రిక్స్ మీడియా వర్క్స్ పతాకంపై సాయికిరణ్ ముక్కామల దర్శక నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం 'కథనం'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన పూరిజగన్నాథ్ బిగ్ సీడీను విడుదల చేయగా.. తనికెళ్ళ భరణి ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి కాపీను పూరిజగన్నాథ్ కు అందించారు. ఈ సందర్భంగా..
పూరిజగన్నాథ్ మాట్లాడుతూ.. ''సినిమా పోస్టర్ చాలా బావుంది. సినిమా టైటిల్, ట్యాగ్ లైన్ నాకు బాగా నచ్చాయి. అందరి జీవితాల్లో కథ, కథనం ఉంటాయి. దేవుడు అందరితో ఫుట్ బాల్ ఆడేస్తుంటాడు. అందరి సరదా తీర్చేది ఆయనే. సినిమా మ్యూజిక్ బావుంది. ఆడియో, సినిమా పెద్ద హిట్ కావాలి. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.
కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ.. ''పోస్టర్స్ , టీజర్ క్యూరియాసిటీ కలిగిస్తున్నాయి. పాటలు కూడా చాలా బావున్నాయి. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. ''ఏల్చూరి వెంకట్రావు గారి కుమారుడు రంజిత్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. వృత్తి పరంగా తను డాక్టర్ అయినా సినిమాల మీద మక్కువతో హీరోగా నటించాడు. అందరు కొత్త వాళ్ళతో తెరకెక్కిన ఈ చిత్రం పెద్ద సక్సెస్ కావాలి. టీం అందరికి నా శుభాకాంక్షలు.'' అని చెప్పారు.
మ్యూజిక్ డైరెక్టర్ సాబు వర్గీస్ మాట్లాడుతూ.. ''నాకు ఈ అవకాశం ఇచ్చిన సాయి కిరణ్ గారికి ఎప్పటకి రుణపడి ఉంటాను'' అని చెప్పారు.
సాయికిరణ్ ముక్కామల మాట్లాడుతూ.. ''ప్రతి మనిషి జీవితంలో ఓ కథ ఉంటుంది దానికో కథనం ఉంటుంది. కాని ఈ సినిమాలో కథనం ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది''అని అన్నారు.
రంజిత్ మాట్లాడుతూ.. ''ఒక డాక్టర్ గా ఇప్పటివరకు అందరికి న్యాయం చేసాను. ఓ నటునిగా కూడా మంచి పేరు తెచ్చుకోవాలనే ప్యాషన్ తో సినిమాలలోకి వచ్చాను. మంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్ ఇది. అందరం కష్టపడి వర్క్ చేశాం. నా మొదటి సినిమానే కన్నడ, తెలుగు భాషల్లో రిలీజ్ అవ్వడం సంతోషంగా ఉంది'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పరుచూరి వెంకటేశ్వరావు, రుద్ర, నాగీనీడు, సురేష్ కొండేటి, అర్చన తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి కెమరామెన్: సురేష్ గోంట్ల, మ్యూజిక్: సాబు వర్గీస్, లిరిక్స్: విజయేంద్ర చేలో, ఎడిటర్: కె.రమేష్, ఆర్ట్: ప్రేమ్, కో ప్రొడ్యూసర్: రంజిత్.