Advertisementt

చివరి వరకు సినిమాలు చేస్తూనే ఉంటా:బాలయ్య

Tue 19th Jan 2016 12:38 PM
dictator movie success meet,balakrishna,srivas  చివరి వరకు సినిమాలు చేస్తూనే ఉంటా:బాలయ్య
చివరి వరకు సినిమాలు చేస్తూనే ఉంటా:బాలయ్య
Advertisement

నందమూరి బాలకృష్ణ హీరోగా, అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాస్వ క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీవాస్ దర్శకత్వం వహించిన చిత్రం 'డిక్టేటర్'. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోమవారం హైదరాబాద్ లోని విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో..

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ''కుల, భాష, మతం అనే తేడాలు లేకుండా అందరూ కలిసి పని చేసే పరిశ్రమే చిత్ర పరిశ్రమ. లెజెండ్ అంటే ఎన్.టి.రామారావు గారే. ఆయన 20వ వర్ధంతి రోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం సంతోషంగా ఉంది. నటునిగా విభిన్న పాత్రల్లో నటించడానికి నాకు స్ఫూర్తినిచ్చిన మాహా వ్యక్తి ఆయన. నాకు నేనే పోటీ అని ముందు నుండి చెప్తూనే ఉన్నాను. అన్నట్లుగానే సంక్రాంతికి నా చిత్రాన్ని పెద్ద హిట్ చేశారు. నాకు తండ్రి, గురువు, దైవం అన్ని ఎన్.టి.రామారావు గారే. ఈ సినిమా టైటిల్ డిక్టేటర్ అని పెట్టినప్పుడు నేను టెన్షన్ పడలేదు. శ్రీవాస్ తో అలాంటి టైటిల్ పెట్టాం కదా.. జాగ్రత్తగా వర్క్ చేద్దామని మాత్రమే చెప్పాను. క్రమశిక్షణ ఉన్న దర్శకుడు శ్రీవాస్. ఈరోస్ ఇంటర్నేషనల్ లక్కీ బ్యానర్. ఎన్నో మంచి మంచి చిత్రాలను నిర్మించారు. అలాంటి సంస్థ తెలుగులో సినిమాలు నిర్మించడం మన అధ్రుష్టమనే చెప్పాలి. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయాలని టీం అందరూ రేయింబవళ్ళు కష్టపడి పని చేశారు. సోనాల్, అంజలి చక్కగా నటించారు. కెమెరా, ఎడిటింగ్ అనేవి సినిమాలో ముఖ్యమైన శాఖలు. ఎడిటర్ గౌతంరాజు గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1000 సినిమాలకు ఎడిటింగ్ చేసిన అనుభవం ఉన్న వ్యక్తి. ఇక కెమెరామెన్ శ్యాం కె నాయుడు ప్రతి ఫ్రేం ను ఎంతో రిచ్ గా అందంగా చూపించారు. ఆణిముత్యాల్లాంటి పాటలకు తమన్ అధ్బుతమైన బాణీలను అందించారు. శ్రీవాస్ అన్ని తానై ఈ సినిమాకు పని చేశాడు. ఈ సినిమా విజయంతో నాలో రెట్టింపు బలం, ఉత్సాహం పెరిగాయి. నా చివరి రక్తపు బిందువు వరకు ప్రేక్షకులకు వైవిధ్యమైన చిత్రాలను అందించడానికి ప్రయత్నిస్తాను'' అని చెప్పారు.

శ్రీవాస్ మాట్లాడుతూ.. ''మాస్ హీరో అంటే ఏంటో బాలయ్య గారు చూపించారు. సినిమాకు ప్రతి చోట మంచి స్పందన లభిస్తోంది. రిలీజ్ అయిన మొదటి రోజు సుమారుగా రోజులో 8 నుండి 9 గంటలు ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాను. ప్రతి ఒక్కరు ఫోన్ చేసి బావుందని చెప్పారు. నేను ఎన్.టి.రామారావు గారికి పెద్ద అభిమానిని. ఆయన 20వ వర్ధంతి రోజు ఈ సినిమా సక్సెస్ మీట్ జరుపుకోవడం ఆనందంగా ఉంది. బాలకృష్ణ గారి 99 వ సినిమా అని ఎంతో కేర్ తీసుకొని సినిమా చేశాం. ఇప్పటివరకు బాలయ్య గారు అన్ని ఎమోషన్స్ ఉన్న సినిమాల్లో నటించేశారు. కాబట్టి అందరికి అర్ధమయ్యే కథను తీసుకొని బాలయ్య ను కొత్త యాంగల్ లో చూపించాలనుకున్నాం. ప్రతి టెక్నీషియన్ మనసు పెట్టి చేసిన సినిమా ఇది. ఈరోస్ ఇంటర్నేషనల్ వారు ఇచ్చిన సపోర్ట్ మరువలేనిది. వాళ్ళ జెన్యునిటీకి నిదర్శనమే ఈ డిక్టేటర్. ఈ సంస్థతో కలిసి మరిన్ని సినిమాలు చేయనున్నాం'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో సోనాల్ చౌహాన్, జ్యోతి, రఘుబాబు, సుమన్, రాజీవ్ కనకాల, శ్యాం కె నాయుడు, గౌతంరాజు, జి.వి., భాస్కర్ భట్ల, శ్రీధర్ సీపాన, రత్నం, కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement