Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ - కళ్యాణ్‌ కృష్ణ కురసాల

Fri 15th Jan 2016 08:09 PM
kalyan krishna kurasala interview,director kalyan krishna interview,soggade chinni nayana,nagarjuna  సినీజోష్ ఇంటర్వ్యూ - కళ్యాణ్‌ కృష్ణ కురసాల
సినీజోష్ ఇంటర్వ్యూ - కళ్యాణ్‌ కృష్ణ కురసాల
Advertisement
Ads by CJ

'సోగ్గాడే చిన్ని నాయనా' అన్నీ ఎలిమెంట్స్‌ ఉన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 

                                               - దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ కురసాల 

కింగ్‌ నాగార్జున హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా'. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం జనవరి 15న విడుదల అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ కురసాలతో ఇంటర్వ్యూ.... 

మీ నేపథ్యం ఏమిటి? 

- మాది పశ్చిమ గోదావరి జిల్లా, తర్వాత వైజాగ్‌లో స్థిరపడ్డాం. అక్కడే నా చదువంతా కొనసాగింది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత నుండి హైదరాబాద్‌లోనే ఉంటున్నాను. నేను డైరెక్టర్‌ తేజ, పోసాని, సూర్య మూవీస్‌ ప్రొడక్షన్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాను. 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాను. 

'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా డైరెక్షన్‌ అవకాశం ఎలా వచ్చింది? 

- నేను నాగచైతన్యగారితో సినిమా చేయాలని నా స్క్రిప్ట్‌తో నాగార్జునగారితో ట్రావెల్‌ చేస్తున్నప్పుడు దర్శక నిర్మాత రామ్మోహన్‌గారితో నాలుగు సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఓ రోజు ఆయన నాకు కాల్‌ చేసి ఓ స్క్రిప్ట్‌ అనుకుంటున్నాను, డైరెక్ట్‌ చేస్తావా అని అడిగారు. నేను సరేనన్నాను. ఆయన నాకు మెయిల్‌ పెట్టారు. ఆ లైన్‌ చూసి నేను వెళ్ళి ఆయన్ను కలిసి మాట్లాడిన తర్వాత పదిహేను రోజులు టైమ్‌ తీసుకుని స్క్రిప్ట్‌ తయారు చేసుకుని వెళ్లి నాగార్జునగారికి ఈ కథను వినిపించాను. ఆయనకు వెంటనే నచ్చింది. 'ఫుల్‌ స్క్రిప్ట్‌ రెడీ చేసుకుని రా' అన్నారు. నేను ఫుల్‌ బౌండెడ్‌ స్క్రిప్ట్‌ రెడీ చేసిన తర్వాత మళ్ళీ నాగార్జునగారిని కలిశాను. ఆయన మరుసటి రోజు రమ్యకృష్ణగారికి వినిపించమన్నారు. నేను రమ్యకృష్ణగారిని కలిసి ఆమెకు ఈ కథను వినిపించాను. ఆమెకు కూడా నచ్చడంతో సినిమా స్టార్టయింది. 

ఈ టైటిల్‌ను పెట్టడానికి రీజన్‌? 

- సినిమాలో నాగార్జునగారు రెండు పాత్రలు చేశారు. అందులో బంగార్రాజు అనే క్యారెక్టర్‌ను బేస్‌ చేసుకుని ఈ సినిమా టైటిల్‌ను 'సోగ్గాడే చిన్ని నాయనా' అని పెట్టాం. బంగార్రాజు సరదాగా ఉండే క్యారెక్టర్‌, అమ్మాయిలతో సరదాగా మాట్లాడుతుంటాడు. ఫ్యామిలీ అంటే చాలా ప్రేమతో ఉంటాడు. ఈ సినిమాలో బంగార్రాజు, రామ్మోహన్‌, సత్యవతి, సీత అనే నాలుగు క్యారెక్టర్సే మెయిన్‌ పిల్లర్స్‌. 

నాగార్జునతో వర్కింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఎలా ఉంది? 

- నాగార్జునగారు చాలా సూపర్‌ పర్సన్‌. నా స్వంత స్క్రిప్ట్స్‌తో నాగచైతన్యతో సినిమాలు చేయాలని నాగార్జునగారిని రెండు, మూడు సార్లు కలిశాను. స్టోరీ బావుంది కానీ నాగచైతన్యకు రెండు కమిట్‌మెంట్స్‌ ఉన్నాయి. అవికాగానే సినిమా చేద్దాం అయితే ఆరు నెలలు వెయిట్‌ చేయాలి అన్నారు. ఆ ట్రావెల్‌లో ఉన్నప్పుడు ఈ స్క్రిప్ట్‌ తయారు చేయడం ఆయనకు నచ్చడం జరిగాయి. నాగార్జునగారు చాలా క్లారిటీతో ఉంటారు. ఆయనకు నచ్చితే నచ్చిందంటారు. లేదంటే లేదని ముందే చెప్పేస్తారు. కాబట్టి ఆయనతో వర్క్‌ చేయడం చాలా సులభమైపోయింది. 

నాగార్జున డబుల్‌ క్యారెక్టర్స్‌ గురించి చెప్పండి? 

- తండ్రి క్యారెక్టర్‌ పేరు బంగార్రాజు. తను చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాడు. ప్లాష్‌ బ్యాక్‌లో తప్ప సినిమా అంతా బంగార్రాజు క్యారెక్టర్‌ ఆత్మలా కనపడుతుంటాడు. అందరితో సరదాగా ఉంటాడు. కొడుకు క్యారెక్టర్‌ పేరు రామ్మోహన్‌. తను డాక్టర్‌ చదువుకుని ఉంటాడు. తల్లి అతన్ని చాలా పద్ధతిగా పెంచడం, 24 గంటలు చదువుతూ ఉండటంతో ఎప్పుడూ తన పని గురించే ఆలోచిస్తుంటాడు. అతని భార్యతో ఎలా ఉండాలో కూడా తెలియని మైండ్‌ సెట్‌లో ఉంటాడు. అంత ఎక్స్‌ప్రెసివ్‌ కాలేని క్యారెక్టర్‌. 

నాగార్జున వంటి సీనియర్‌ హీరోతో చేస్తున్నప్పుడు ప్రెషర్‌ ఫీలయ్యారా? 

- అదేం లేదండీ.. ఇంతకు ముందు చెప్పినట్టు నాగార్జునగారు చాలా క్లారిటీతో ఉంటారు. ప్రతి సందర్భంలో నాకు ఆయన అండగా నిలబడ్డారు. అదీ కాకుండా ఆయనతో ఆరు నెలలు నుండి ట్రావెల్‌ చేస్తుండటం ఇంకా ప్లస్‌ అయింది. నేను బేసిక్‌గా రైటర్‌ను, అసిస్టెంట్‌గా వర్క్‌ చేయడం వల్ల నేను స్క్రిప్ట్‌ రాసుకునే విధానం, నెరేషన్‌ నాగార్జునగారికి బాగా నచ్చింది. అందువల్లే ఆయన దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చారు. 

సినిమాలో హైలైట్స్‌ ఏంటి? 

- సినిమా ఫుల్‌ కామెడి ఎంటర్‌టైనర్‌. ఫన్‌తో పాటు అన్నీ ఎమోషన్స్‌ ఉన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ముఖ్యంగా కథలో మంచి సోల్‌ ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు యమలోకం అంటే ఒక దర్బార్‌లాగా చూపించారు. కానీ సినిమాలో యమలోకం అంటే ఓ లోకంలా చూపించాలనుకుని అలానే చూపించాం. ఆ యమలోకం సీన్‌ అందరికీ కొత్తగా అనిపిస్తుంది. చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో నాలుగు క్యారెక్టర్స్‌ కాకుండా పాము ఓ కీలకమైన క్యారెక్టర్‌లా కనపడుతుంది. ఇది కాకుండా మైసూర్‌లోని కరైతన్నూర్‌లో రెండువేల సంవత్సరాల పురాతనమైన ఓ వేంకటేశ్వరుని ఆలయాన్ని శివాలయంగా చూపించాం. ఇది కూడా ఆడియెన్స్‌కు నచ్చుతుంది. అలాగే పోసానిగారు, బ్రహ్మానందం, నాగబాబు ఇలా ప్రతి క్యారెక్టర్‌కు ప్రాముఖ్యత ఉంటుంది. 

అనూప్‌ మ్యూజిక్‌ గురించి చెప్పండి? 

- 'మనం' తర్వాత అనూప్‌ మరోసారి ఆయన కెరీర్‌లో ది బెస్ట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. సాంగ్స్‌ అన్నీ హిట్టయ్యాయి. ట్యూన్స్‌ కంటే ఇంకా బాగా రీరికార్డింగ్‌ ఇచ్చారు. 

నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్స్‌? 

- నా సెకండ్‌ మూవీ కూడా అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌లోనే ఉంటుంది. అల్రెడి సైన్‌ చేశాను. అయితే ఆ సినిమా ఎవరితో ఉంటుందనేది ఇంకా కన్‌ఫర్మ్‌ కాలేదు. త్వరలోనే వివరాలు తెలుస్తాయంటూ ఇంటర్వ్యూ ముగించారు డైరెక్టర్‌ కళ్యాణ్‌ కృష్ణ కురసాల

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ