Advertisementt

జబర్దస్థ్ అప్పారావు 'రెడీ యాక్షన్ కట్'!

Tue 05th Jan 2016 08:16 PM
jabardasth apparao,c.h.kasthuri,ready action cut movie  జబర్దస్థ్ అప్పారావు 'రెడీ యాక్షన్ కట్'!
జబర్దస్థ్ అప్పారావు 'రెడీ యాక్షన్ కట్'!
Advertisement
Ads by CJ

జబర్దస్థ్ ప్రొగ్రామ్ లో తన చిత్రవిచిత్రమైన వేషధారణలతో,నటనతో ఆకట్టుకుంటోన్న అప్పారావు ప్రధాన పాత్రలో రెడీ యాక్షన్ కట్ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది..  శ్రీ పద్మావతి వెంకట రమణ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ కొరియో గ్రాఫర్ శ్రీమతి సి.హెచ్. కస్తూరి దర్శకనిర్మాతగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు..

ఈ సినిమా గురించి దర్శక నిర్మాత సి.హెచ్. కస్తూరి మాట్లాడుతూ... ''జనవరి 1న నూతన సంవత్సరం సందర్బంగా ఈ సినిమా సాంగ్స్ రికార్డింగ్ చేశాం.. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 14న చిత్రీకరణను ప్రారంభించనున్నాము..అప్పారావు ప్రధాన పాత్రలో  పాత కొత్త నటీనటుల కలయికలో ఆద్యంతం వినోదాత్మకంగా ఈ సినిమా రూపొందిస్తామని తెలిపారు''.

ఈ చిత్రానికి సంగీతం: రాజ్ కిరణ్, పాటలు: గురుచరణ్, రంగారావు..కూర్పు: శ్రీను బాబు.. కెమెరా: నాగబాబు.. మాటలు- దర్శకత్వ పర్యవేక్షణ : నండూరి వీరేష్.. నిర్మణాం- కధ- స్ర్కీన్ ప్లే - దర్శకత్వం : సి.హెచ్.కస్తూరి..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ