అనురాగ్, తనూజ, మనోజ్, మోహన్ ప్రధాన పాత్రల్లో రవి వీడే దర్శకత్వంలో నివాస్ క్రియేషన్స్ పతాకంపై జి.నివాస్ నిర్మిస్తున్న చిత్రం 'సంజీవని'. ఈ చిత్రం టీజర్ ను సోమవారం హైదరాబాద్ లో విడుదల చేసారు. ఈ సందర్భంగా..
రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ''సినిమా టీజర్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. హాలీవుడ్ రేంజ్ లో ఉన్నట్లు అనిపిస్తుంది. సి.జి. వర్క్ చాలా రిచ్ గా ఉంది. మంచి మ్యూజిక్ కుదిరింది. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
తుమల్లపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ''పోస్టర్స్, టీజర్ అధ్బుతంగా ఉన్నాయి. డైరెక్టర్ మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. అందరూ కష్టపడి పని చేశారు. సినిమా మంచి హిట్ కావాలి. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.
దర్శకుడు రవి వీడే మాట్లాడుతూ.. ''ఈ చిత్రాన్ని మొదలుపెట్టి సంవత్సరంన్నర అయింది. ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఈ కథను సినిమా చేయడం సాధ్యమా..? అనే అనుమానాలు వ్యక్తం చేశారు. దానికోసం ట్రైలర్ షూట్స్, గ్రాఫిక్స్ వర్క్, స్టొరీ మాడిఫికేషన్ చేసి సినిమా మొదలుపెట్టాం. దీనికి సుమారుగా ఆరు నెలల సమయం పట్టింది. 2015 మార్చి 1న షూటింగ్ మొదలుపెట్టి 66 రోజుల్లో పూర్తి చేసేశాం. డిఫరెంట్ లోకేషన్స్ లో షూట్ చేశాం. శ్రవణ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. రెగ్యులర్ తెలుగు మ్యూజిక్ లా కాకుండా చాలా కొత్తగా ఉంటుంది. ఆర్టిస్ట్స్ ఎంతో డెడికేషన్ తో వర్క్ చేశారు. ప్రొడ్యూసర్ గారు మాకు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేనిది'' అని చెప్పారు.
నిర్మాత నివాస్ మాట్లాడుతూ.. ''మంచి టాలెంట్ ఉన్న వారంతా కలిసి ఈ సినిమాకు వర్క్ చేశారు. చాలా ఎంజాయ్ చేస్తూ.. షూట్ చేశాం. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం'' అని చెప్పారు.
అనురాగ్ మాట్లాడుతూ.. ''డైరెక్టర్ గారికి ప్రతి డిపార్ట్మెంట్ లో మంచి నాలెడ్జ్ ఉంది. కూల్ పెర్సన్. టీజర్ నాకు బాగా నచ్చింది. శ్రవణ్ మ్యూజిక్ అదరగొట్టేశాడు'' అని చెప్పారు.
మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ మాట్లాడుతూ.. ''డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఓ గ్లోబల్ ఫీల్ ఉన్న సినిమా చేయాలని 'సంజీవని' మొదలుపెట్టాం. డైరెక్టర్, టీం మీద ఉన్న నమ్మకంతో నిర్మాత సినిమా చేయడానికి ముందుకొచ్చారు. సినిమాలో మొత్తం 5 పాటలుంటాయి. మంచి మ్యూజిక్ కుదిరింది'' అని చెప్పారు.
ఈ చిత్రానికి మ్యూజిక్: శ్రవణ్ కె.కె, ఫోటోగ్రఫీ: సుజీత్ పాలడుగు, పాటలు: బాలవర్ధన్, ఆనంద్ విరంచి, విఎఫ్ఎక్స్: అభిషేక్, స్టంట్స్: నందు, శేఖర్ బాబు, సౌండ్ డిజైన్: సాకేత్ కొమండురి, నిర్మాత: జి.నివాస్, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-ఎడిటింగ్-దర్శకత్వం: రవి వీడే.