Advertisementt

శ్రీవత్స క్రియేషన్స్ సినిమా ప్రారంభం!

Mon 04th Jan 2016 02:13 PM
sreevathsa creations,sashi bhushan,kamal kumar,sanjay  శ్రీవత్స క్రియేషన్స్ సినిమా ప్రారంభం!
శ్రీవత్స క్రియేషన్స్ సినిమా ప్రారంభం!
Advertisement
Ads by CJ

సంజయ్, చేతన ఉత్తేజ్, కారుణ్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్న శ్రీవత్స క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా సోమవారం హైదరాబాద్ లో ప్రారంభమైంది. వి.వి.శశి భూషణ్ దర్శకుడు. కమల్ కుమార్ పెండెం నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి కె.ఎస్.రామారావు క్లాప్ కొట్టగా శ్రీమతి వాణి కెమెరా స్విచ్ ఆన్ చేసారు. తమ్మారెడ్డి భరద్వాజ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..

దర్శకుడు వి.వి.శశి భూషణ్ మాట్లాడుతూ.. ''ప్రేమ అనేది యూనివర్సల్. ప్రతి మనిషి ప్రేమకు తనదైన శైలిలో నిర్వచనం చెప్తుంటాడు. ప్రేమ అన్నది వ్యక్తిగతం కూడా.. ఒక అమ్మాయిని అమితంగా ప్రేమించిన ఓ కుర్రాడు ప్రేమలో తను చేసిన తప్పులను తెలుసుకొని తన వల్ల జరిగిన పొరపాటును ఎలా చక్కదిద్దుకున్నాడు..? తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు..? అనే అంశాలపై సినిమా నడుస్తుంది. ఈ చిత్రంలో నాగబాబు గారు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఈ సంవత్సరం హిట్ చిత్రాల్లో మా సినిమా కూడా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నాం'' అని చెప్పారు.

నిర్మాత కమల్ కుమార్ పెండెం మాట్లాడుతూ.. ''కుటుంబ సమేతంగా అందరు చూడదగ్గ చిత్రలాను నిర్మించడానికే ఈ బ్యానర్ ను స్థాపించాం. శశి చెప్పిన సబ్జెక్టు నచ్చి సినిమా చేయాలనుకున్నాం. సంక్రాంతి తరువాత నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి ఒక షెడ్యూల్ లో సినిమా టాకీ పార్ట్ పూర్తి చేయాలనుకుంటున్నాం. సాంగ్స్ మరో షెడ్యూల్ లో పూర్తి చేయనున్నాం. టాకీ పార్ట్ కోసం అమలాపురం, బందర్, రాజమండ్రీ తదితర ప్రాంతాల్లో షూట్ చేసి సాంగ్స్ మాత్రం కేరళ, కర్నాటక లో చిత్రీకరించనున్నాం'' అని చెప్పారు.

సంజయ్ మాట్లాడుతూ.. ''వెల్కమ్ ఒబామా చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాను. ఇది నా మూడవ సినిమా. స్టొరీ చాలా బాగా నచ్చింది. సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో చేతన ఉత్తేజ్, కారుణ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకటహనుమ, సంగీతం: రాం నారాయణ్, ఆర్ట్: రమేష్, కాస్ట్యూమ్స్: తిరుమల, స్టిల్స్: వెంకట్, విజువల్ ఎఫెక్ట్స్: నాగరాజు, నిర్మాత: కమల్ కుమార్ పెండెం, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: వి.వి.శశిభుషణ్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ