Advertisementt

'వేటపాలెం' ఆడియో విడుదల!

Mon 04th Jan 2016 02:05 PM
vetapalem movie audio release,venkatreddy,shilpa,munna  'వేటపాలెం' ఆడియో విడుదల!
'వేటపాలెం' ఆడియో విడుదల!
Advertisement
Ads by CJ

ప్రశాంత్‌, లావణ్య, శిల్ప  ప్రధాన పాత్రల్లో మాస్టర్‌ అమరావతి సురోచన్‌ సమర్పణలో హని, ప్రణి ఫిలింస్‌ బ్యానర్‌పై డా.ఎ.వి.ఆర్‌ నిర్మాతగా నంది వెంకట రెడ్డి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'వేటపాలెం'. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. సినిమా ఆడియో సీడీలను బేబి శ్లోక ఆవిష్కరించి తొలి కాపీను దైవజ్ఞశర్మకు అందించారు. ఈ సందర్భంగా...

చిత్ర నిర్మాత డా||ఎ.వి.ఆర్ మాట్లాడుతూ.. ''నిర్మాతగా తొలి చిత్రం. దర్శకుడు చెప్పిన పాయింట్‌ నచ్చడంతో కష్టమైనా.. ఇండస్ట్రీతో పరిచయం లేకున్నా సినిమా చేశాను. హీరోయిన్‌ శిల్ప చక్కగా నటించింది. సన్ని మంచి మ్యూజిక్‌ అందించారు. సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌'' అని చెప్పారు. 

దర్శకుడు నంది వెంకట రెడ్డి మాట్లాడుతూ.. ''అనాథ పిల్లలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వారి భవిష్యత్ ఎలా ఉంటుంది. వారికి సరైన గైడెన్స్ లేకుండా క్రిమినల్స్ గా కూడా మారుతున్నారు. క్రైమ్ నేపథ్యంలో సినిమా ఉంటుంది. పక్కా కమర్షియల్‌ సినిమా. నిర్మాతగారు పూర్తి స్వేచ్చనిచ్చి వర్క్‌ చేయించారు. అవకాశం ఇచ్చిన నిర్మాతగారికి, సపోర్ట్‌ చేసిన నటీనటుకు థాంక్స్‌'' అని అన్నారు. 

మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎ.ఆర్‌.సన్ని మాట్లాడుతూ.. ''డైరెక్టర్ వెంకట్ గారితో కలిసి చేస్తున్న మూడో చిత్రమిది. మంచి మ్యూజిక్‌ కుదిరింది. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతకు థాంక్స్‌'' అని అన్నారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో ఎ.ఎం.రెడ్డి, మున్నా, శిల్ప తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి కెమెరా: డి.యాదగిరి, సంగీతం: ఎ.ఆర్.సన్నీ, పాటలు: నర్ల రామకృష్ణారెడ్డి, మాటలు-కోడైరెక్టర్: గణేష్ ముత్యాల, సహనిర్మాత: తంగిరాల అపర్ణ, నిర్మాత: డా||ఎ.వి.ఆర్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నంది వెంకటరెడ్డి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ