Advertisement
TDP Ads

'నేను.. శైలజ' సక్సెస్ మీట్!

Mon 04th Jan 2016 12:49 PM
nenu sailaja success meet,ram,sravanthi ravikishore,kishore thirumala  'నేను.. శైలజ' సక్సెస్ మీట్!
'నేను.. శైలజ' సక్సెస్ మీట్!
Advertisement

రామ్, కీర్తి సురేష్ జంటగా కృష్ణ చైతన్య సమర్పణలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్న చిత్రం 'నేను.. శైలజ'. కిషోర్ తిరుమల దర్శకుడు. జనవరి 1న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లోని సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో..

రామ్ మాట్లాడుతూ.. ''దేవదాసు' సినిమాను పక్కన పెడితే నా సినిమాల్లో మేజర్ హిట్స్ అన్నీ కామెడీ చిత్రాలే. 'గణేష్' అనే సాఫ్ట్ క్యారెక్టర్ గల సినిమా చేశాను. ఆ చిత్రానికి నేను ఆశించిన రిజల్ట్ అందుకోలేదు. ఆ తరువాత మాస్ సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యి 'కందిరీగ' చేశాను. అది పెద్ద హిట్ అయ్యింది. మొదటిసారి మాస్ ఎలిమెంట్స్ పక్కన పెట్టి క్యూట్ లవ్ స్టొరీగా ఈ సినిమా చేశాను. ఈ సినిమాలో నేను కొత్తగా కనిపించాలని పూర్తి బాధ్యత డైరెక్టర్ కే అప్పగించాను. కంప్లీట్ కేర్ తీసుకొని ఈ సినిమా చేశారు. థియేటర్ లో చూసే ప్రతి ఒక్కరు ఈ సినిమాకు కనెక్ట్ అవుతున్నారు. డైరెక్టర్ గారు నేరేట్ చేసినప్పుడు చాలా పాయింట్స్ నాకు రిలేటెడ్ గా అనిపించాయి. దేవిశ్రీప్రసాద్ గారి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ కి థాంక్స్'' అని చెప్పారు. 

స్రవంతి రవికిషోర్ మాట్లాడుతూ.. ''నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని రూపొందించాం. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే స్క్రిప్ట్. సెన్సిటివ్ పాయింట్ కు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి తీశారు. కిషోర్ ప్రెజంట్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. సినిమాను సక్సెస్ చేసిన ఆడియన్స్ కు థాంక్స్'' అని చెప్పారు.

కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. ''ఇదొక సినిమాల కాకుండా రియలిస్టిక్ గా ఉండాలని జాగ్రత్తలు తీసుకొని చేశాం. కథ నేరేట్ చేసినప్పుడు అందరికి బాగా నచ్చింది. మా కథను ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది'' అని చెప్పారు.

సురేష్ బాబు మాట్లాడుతూ.. ''డైరెక్టర్ ను కాకుండా కంటెంట్ ను నమ్మి సినిమాలు తీస్తే రిజల్ట్ ఎంత గొప్పగా ఉంటుందో.. ఈ సినిమా నిరూపించింది. మంచి సినిమాలు తీస్తే ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. ఈ చిత్రాన్ని కూడా ఎంతగానో ఆదరిస్తున్నారు'' అని చెప్పారు. 

దిల్ రాజు మాట్లాడుతూ.. ''ఈ చిత్రాన్ని దర్శకుడు మలిచిన విధానం ఆకట్టుకునే విధంగా ఉంది. సినిమాలో రామ్ కనిపించలేదు.. హరి అనే క్యారెక్టర్ మాత్రమే కనిపించింది. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ లో ఎప్పుడు మంచి చిత్రాలే వస్తాయి'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో చైతన్య కృష్ణ, సమీర్ రెడ్డి, భాస్కర్ భట్ల, అనంతశ్రీరాం, బి.ఏ.రాజు, సురేష్ కొండేటి, మాడురి మధు, ప్రభు, మోహన్ తుమ్మల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement