శ్రీ రంజిత్ మూవీస్ పతాకం పై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ 'అలా మొదలైంది', 'అంతకు ముందు ఆ తరువాత' లాంటి కుటుంబ కధా చిత్రాల తరువాత బి.వి నందిని రెడ్డి దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం 'కళ్యాణ వైభోగమే'. నాగ శౌర్య , మాళవిక నాయర్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో జరిగింది. రామ్ బిగ్ సీడీను, ఆడియో సీడీలను ఆవిష్కరింఛి మొదటి కాపీను సుమంత్ అశ్విన్ కు అందించారు. ఈ సందర్భంగా..
రామ్ మాట్లాడుతూ.. ''దామోదర్ ప్రసాద్ గారు టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. స్క్రిప్ట్ ను నమ్మి సినిమాలు తీసే అతి కొద్ది మంది నిర్మాతల్లో ఆయనొకరు. నందిని రెడ్డి గారు ఎనర్జిటిక్ ఫిమేల్ డైరెక్టర్. నాగశౌర్య తన మొదటి సినిమాలోనే అద్బుతంగా నటించాడు. ఈ సినిమాలో కూడా చాలా బాగా చేసి ఉంటాడు. కళ్యాన్ కోడూరి గారి రీరికార్డింగ్, సాంగ్స్ సూపర్బ్. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.
నాగశౌర్య మాట్లాడుతూ.. ''కళ్యాణ్ కోడూరి గారి సంగీతంలో మనశ్శాంతి దొరుకుతుంది. బాధలో ఉన్నప్పుడు ఆయన పాటలు వింటే బాగా కనెక్ట్ అవుతాయి. కంటిన్యూస్ గా ఆయనతో పని చేసే అవకాశం లభిస్తోంది. దామోదర్ గారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్. నందిని రెడ్డి గారితో మళ్ళి మళ్ళి వర్క్ చేయాలనుంది. సినిమాటోగ్రాఫర్ రాజ్ గారు నన్ను చాలా అందంగా చూపించారు. సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ''నేను చేసే ప్రతి సినిమాతో కొత్త వాళ్ళను ఇంట్రడ్యూస్ చేస్తుంటాను. ఈ సినిమా ద్వారా రాజు అనే సినిమాటోగ్రాఫర్ ను పరిచయం చేస్తున్నాం. సినిమా విజువల్ గా చాలా అందంగా ఉంటుంది. సినిమా యూనిట్ నా ఫ్యామిలీ లాంటిది. అందరం హార్డ్ వర్క్ చేసి తీసిన సినిమా. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్'' అని చెప్పారు.
నందిని రెడ్డి మాట్లాడుతూ.. ''ఎంజాయ్ చేస్తూ షూట్ చేశాం. మంచి పాటలు, మాటలు అందించిన లక్ష్మి భూపాల్ గారికి థాంక్స్. కళ్యాన్ కోడూరి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. నా కథలు దామోదర్ ప్రసాద్ గారికి, స్వప్న దత్ లకే బాగా అర్ధమవుతాయి. నన్ను నమ్మి దామోదర్ గారు ఈ సినిమా చేశారు. అందరం ప్రేమించి, నమ్మి చేసిన సినిమా. నాగశౌర్య, మాళవిక ఎంతో డెడికేషన్ తో వర్క్ చేశారు. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
కళ్యాణ్ కోడూరి మాట్లాడుతూ.. ''ఈ బ్యానర్ లో నాకు నాల్గవ సినిమా ఇది. సాంగ్స్ అందరికి నచ్చుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. నందినికి ఈ సినిమా పెద్ద హిట్ కావాలి'' అని చెప్పారు
సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ.. ''కళ్యాన్ సాంగ్స్ చాలా బావున్నాయి. విజువల్ గా చాలా ఇంటరెస్టింగ్ గా ఉన్నాయి. గొప్ప ప్రొడక్షన్ వాల్యూస్ తో చేసిన సినిమా. నందిని రెడ్డి గారు చాలా బాగా డైరెక్ట్ చేస్తారు. హిట్ కాంబినేషన్ లో వస్తోన్న ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది'' అని చెప్పారు.
దసరథ్ మాట్లాడుతూ.. ''అలా మొదలైంది సినిమాతో హిట్ కొట్టిన క్రేజీ కాంబినేషన్ మరోసారి 'కళ్యాణ వైభోగమే' అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా సినిమా సక్సెస్ అవుతుంది'' అని చెప్పారు.
ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ.. ''దామోదర్ గారిపై ప్రత్యేకమైన అభిమానం ఉంది. గట్స్ ఉన్న ప్రొడ్యూసర్ ఆయన. 'కళ్యాణ వైభోగమే' అనే మంచి టైటిల్ ఎంచుకున్నారు. టీం అందరికి ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద విజయం అవ్వాలని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.
అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ''ట్రైలర్ చూస్తుంటే సినిమా ఖచ్చితంగా హిట్ అని తెలుస్తుంది. పాటలు చాలా బావున్నాయి. నాగశౌర్య కు ఈ సినిమా పెద్ద హిట్ కావాలి'' అని చెప్పారు.
జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. ''నందిని రెడ్డి సినిమాలంటే యూత్ కు బాగా దగ్గరగా ఉంటాయి. అందరూ హార్డ్ వర్క్ చేసి తీసిన సినిమా ఇది. పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో మాళవిక, ప్రగతి, రాశి, ఐశ్వర్య, ఠాగూర్ మధు, రాజ్ తరుణ్, సుధాకర్ రెడ్డి, బసిరెడ్డి, బెక్కం వేణుగోపాల్, జెమినీ కిరణ్, స్రవంతి రవికిషోర్, బాబురావు, కోడలి వెంకటేశ్వరావు, ప్రభు,
నాగ శౌర్య , మాళవిక నాయర్, రాశి , ఐశ్వర్య , ఆనంద్ , రాజ్ మదిరాజ్ , తాగుబోతు రమేష్ , ధనరాజ్, హేమంత్ , స్నిగ్ధ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : కళ్యాణ్ కోడూరి, సినిమాటోగ్రఫీ : జి.వి.ఎస్.రాజు, ఎడిటర్ : జునైద్ సిద్దిక్, కొరియోగ్రఫీ : చిన్ని ప్రకాష్ , రఘు , అని, యాక్షన్ : డ్రాగన్ ప్రకాష్, పాంథర్ నాగరాజు, కాస్ట్యూమ్ డిజైనర్ : శ్రీ , వైశాలి, డైలాగ్స్ & లిరిక్స్ : లక్ష్మీ భూపాల్, కో - ప్రొడ్యూసర్స్ : వివేక్ కూచిభొట్ల , జగన్ మోహన్ రెడ్డి . వి, ప్రొడ్యూసర్ : కె . ఎల్ . దామోదర్ ప్రసాద్, స్టొరీ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : బి వి నందిని రెడ్డి .