ప్రియాంక నాయుడు ప్రధాన పాత్రలో గడ్డంపల్లి రవీందర్ రెడ్డి సమర్పణలో ప్రకాష్ దర్శకత్వంలో ఎన్.రాంబాబు నిర్మిస్తున్న చిత్రం 'అనగనగా ఒక దుర్గ'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ కవిత బిగ్ సీడీను, ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా..
ఎంపీ కవిత మాట్లాడుతూ.. ''తెలంగాణా రేడియో ద్వారా సుపరిచితుడైన క్రాంతి ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయమవుతున్నాడు. చిన్న చిత్రాలు సక్సెస్ అయితేనే చలన చిత్ర పరిశ్రమ బావుంటుంది. సినీ నిర్మాణానికి అనువైన నగరంగా హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలను చేపడుతోంది. కెసిఆర్ గారు సినిమా ఇండస్ట్రీను డెవలప్ చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు. రాంబాబు కార్యకర్తగా ఎనలేని సేవలనందించారు. ఈ సినిమాతో తను నిర్మాతగా నిలదొక్కుకోవాలని ఆశిస్తున్నాను. పరస్పర సహకారంతో అందరు ఎదగాలి. తెలంగాణ ప్రతిభను చాటి చెప్పడానికి రాంబాబు చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను'' అని చెప్పారు.
చిత్ర దర్శకుడు ప్రకాష్ పులిజాల మాట్లాడుతూ.. ''సొసైటీ లో జరుగుతున్న ఓ బర్నింగ్ ఇష్ష్యూను తీసుకొని దానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమా తీశాను. ఈ సినిమాలో నటించడానికి విజయశాంతి లాంటి అమ్మాయి కావాలని ఎన్నో ఆడిషన్స్ నిర్వహించాను. ఫైనల్ గా ప్రియాంక నాయుడు ని ఎంపిక చేసుకున్నాను. తన నటన చూసిన వారంతా చాలా బాగా చేసిందని చెబుతున్నారు. పాటలతో పాటు సినిమా కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
హీరో క్రాంతి మాట్లాడుతూ.. ''సినిమాలో పాటలు అందరికి నచ్చే విధంగా ఉంటాయి. బాలాజీ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమా మంచి హిట్ అవ్వాలని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో గొంగిడి సునీత, పసునూరి దయాకర్, గట్టు రామచంద్రరావు, రాంబాబు, విజయ బాలాజీ, కాళీ చరణ్ తదితరులు పాల్గొన్నారు.