అజయ్, భరత్, అర్జున్, వెంకటేష్, సుష్మిత ప్రధాన పాత్రల్లో భరత్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ఫిరోజ్ రాజ దర్శకత్వంలో భరత్ కుమార్ పీలం నిర్మిస్తున్న సినిమా 'రాజుగారింట్లో 7వ రోజు'. ఈ చిత్రం రీసెంట్ గా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా..
ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ''ఈ మధ్య కాలంలో హారర్ సబ్జెక్ట్స్ తో వస్తోన్న సినిమాలన్నీ మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. సినిమాలో కంటెంట్ బావుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ట్రైలర్స్, సాంగ్స్ చాలా బావున్నాయి. ఖచ్చితంగా సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది'' అని చెప్పారు.
మల్టీ డైమెన్షన్ వాసు మాట్లాడుతూ.. ''సినిమా టైటిల్ బావుంది. ట్రైలర్స్, సాంగ్స్ చాలా కొత్తగా అనిపించాయి. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
శోభారాణి మాట్లాడుతూ.. ''సినిమా చూసాను. చాలా ఇన్నోవేటివ్ గా అనిపించింది. సినిమా చివరి వరకు సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది. నలుగురు ఖైదీలు దయ్యం ఉన్న ఇంట్లో ఉంటే ఏమవుతుందనేదే ఈ సినిమా. ఫిరోజ్ చాలా బాగా డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాను మా సంస్థ ద్వారా రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది'' అని చెప్పారు.
దర్శకుడు ఫిరోజ్ రాజ మాట్లాడుతూ.. ''క్రైమ్ ఆధారంగా రూపొందించిన ఓ హారర్ ఫిలిం ఇది. స్క్రీన్ ప్లే చాలా బావుంటుంది. ప్రతి ఒక్కరు కష్టపడి ఈ సినిమా చేశారు. ఎస్.వి.ఆర్ మీడియా అధినేత్రి శోభారాణి గారు మాకు సపోర్ట్ చేయడం ఆనందంగా ఉంది'' అని చెప్పారు.
నిర్మాత భరత్ మాట్లాడుతూ.. ''మూవీ అవుట్ పుట్ బాగా వచ్చింది. మంచి హారర్ ఫిలిం. సినిమాలో మొత్తం నాలుగు పాటలుంటాయి. రీసెంట్ సెన్సార్ పూర్తి చేసుకున్నాం. యు/ఏ సర్టిఫికేట్ వచ్చింది. ప్రతి ఒక్కరికి సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్'' అని చెప్పారు.
ఈ చిత్రానికి నిర్మాత: భరత్ కుమార్ పీలం, రచన,దర్శకత్వం: ఫిరోజ్ రాజ, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: క్రాంతి కె.కుమార్, మ్యూజిక్: కనిష్క్, ఎడిటర్: అనిల్, స్టిల్స్: నాగభూషణం.