Advertisementt

రేలంగి ఆవిష్కరించిన 'లిటిల్ స్టార్స్' ఆడియో!

Sun 27th Dec 2015 10:04 PM
little stars audio launch,rasheed basha,ibraheem,srivenkat  రేలంగి ఆవిష్కరించిన 'లిటిల్ స్టార్స్' ఆడియో!
రేలంగి ఆవిష్కరించిన 'లిటిల్ స్టార్స్' ఆడియో!
Advertisement
Ads by CJ

తస్లీమ్, దివిజ, శ్రేష్ఠ, చరణ్, హర్ష, సోనీ, నిఖిత ప్రధాన పాత్రల్లో రషీద్ బాషా దర్శకత్వంలో ఇబ్రహీం షేక్, ఖాజాబి షేక్, నజీమ షేక్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'లిటిల్ స్టార్స్'. ఈ చిత్రం పాటల విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. రేలంగి నరసింహారావు బిగ్ సీడీను, ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి కాపీను లయన్ సాయి వెంకట్ కు అందించారు. ఈ సందర్బంగా..

రేలంగి నరసింహారావు మాట్లాడుతూ.. ''ఈ సినిమా కాన్సెప్ట్ చెప్పారు. చాలా బావుంది. బాగా ఖర్చుపెట్టే ఈ సినిమా తీశారు. పెట్టిన డబ్బులు వచ్చేసి, అనుకున్న సందేశం ప్రేక్షకులకు రీచ్ అయితే ఇలాంటి సినిమాలు మరిని వచ్చే అవకాశాలున్నాయి. చిన్న పిల్లల సినిమాలకు ప్రత్యేకంగా థియేటర్స్ కట్టిస్తామని గతంలో ప్రభుత్వం అనౌన్సు చేసింది. తొందరలోనే ఆ పనులు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

నటుడు వంశీ మాట్లాడుతూ.. ''చిన్న పిల్లలతో సినిమా తీయడమనేది చాలా కష్టమైన విషయం. ఈ సినిమా సక్సెస్ సాధించి అందరు మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

దర్శకుడు రషీద్ బాషా మాట్లాడుతూ.. ''గ్లోబలైజేషన్ కారణంగా జీవనాధారం కోల్పోయిన తన స్నేహితురాలి కుటుంబానికి ఆరుగురు చిన్నారులు సహాయం చేయాలనుకుంటున్నారు. ఆ క్రమంలో వారు ఎలాంటి పరిణామాలు ఎడుర్కొన్నారనేదే ఈ సినిమా. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వెంకట్ మాట్లాడుతూ.. ''సినిమాలో పిల్లలంతా చాలా బాగా నటించారు. వాళ్లకు మంచి భవిష్యత్తు ఉంది'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో రాంకీ, సాయి వెంకట్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కిషన్ సాగర్, సంగీతం: శ్రీ వెంకట్, నిర్మాతలు: ఇబ్రహీం షేక్, ఖాజాబి షేక్, నజీమ షేక్, దర్శకుడు: రషీద్ బాషా.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ